Air India: దేశీయ విమానయాన రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఆయా ఎయిర్ లైన్స్ సంస్థలు కొత్త ఫ్లైట్స్ ను తమ ఫ్లీట్ లో చేర్చుకునేందుకు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా సహా పలు విమానయాన సంస్థలు భారీ సంఖ్యలో కొత్త ఆర్డర్లు పెట్టాయి.
భారత విమానయాన రంగంలో సేవలందించేందుకు ఎయిర్ ఇండియా 470 విమానాలను ఇటీవల ఆర్డర్ చేసింది. కాగా రానున్న 18 నెలల్లో ప్రతి 6 రోజులకు ఒక కొత్త ఎయిర్‌క్రాఫ్ట్ చొప్పున తమ ఫ్లీట్ లో చేరనున్నట్లు కంపెనీ CEO & MD క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. వాటిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆసియా పసిఫిక్ ఎయిర్‌లైన్స్ అసోసియేషన్ అధ్యక్షుల 67వ అసెంబ్లీలో ప్రకటించారు.

'మా ఫ్లీట్ లో పెద్ద ఎత్తున కొత్త విమానాలు చేరనున్నాయి. వీటి నిర్వహణ కోసం చాలా మంది కొత్త సిబ్బందిని నియమిస్తున్నాము. శిక్షణా విధానాన్ని మెరుగుపరచడంతో పాటు మరింత శ్రమించాల్సి ఉంది. కస్టమర్లలో ఎక్కువ మంది మా నుంచి విశ్వసనీయత, సమయపాలన కోరుకుంటున్నారు. వారి అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం. ఇందులో మంచి పురోగతిని సాధిస్తున్నాము' అని వివరించారు.
8 శాతం వార్షిక రేటుతో వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు సేవలందించేందుకు టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా 470 విమానాలను ఆర్డర్ చేసినట్లు విల్సన్ పేర్కొన్నారు. వీటి సహాయంతో ఇతర ఎయిర్‌లైన్స్‌తో పోటీ పడటంతో పాటు తమ ట్రాఫిక్‌ను పెంచుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications