AirIndia: నష్టనివారణ కోసం రంగంలోకి ఎయిర్ ఇండియా.. ప్రయాణీకులపై బాదుడు షురూ..
Cabin Baggage: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణీకులపై అదనపు భారం పడనుంది. అయితే నష్టనివారణ చర్యగా ఎయిర్‌లైన్స్ ఈ దారిని ఎంచుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర విమానయాన సంస్థలు కూడా ఈ దారిలో నడిచే అవకాశమూ లేకపోలేదు.
నష్టాల్లో కొనసాగుతున్న ఎయిర్ ఇండియా ఉచిత క్యాబిన్ బ్యాగేజీ లిమిట్‌ను తగ్గించింది. గతంలో 20 కిలోలుగా ఉన్న ఈ లిమిట్‌ను ఇప్పుడు 15 చేసింది. దేశీయ విమానాల్లో ఎకానమీ ఛార్జీల సెగ్మెంట్ కు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ టాటా గ్రూప్ కంపెనీ గత ఆగస్టులో ప్రవేశపెట్టిన మెనూ ఆధారిత ధరల మోడల్ ఫేర్‌లో మార్పులు చేయబడినట్లు వెల్లడించింది. అన్నింటికీ ఒకే ప్రామాణిక విధానం అనువైనది కాదని పేర్కొంది.

మే 2 ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే విధంగా 'కంఫర్ట్' మరియు 'కంఫర్ట్ ప్లస్' కేటగిరీలకు ఉచిత క్యాబిన్ బ్యాగేజీ అలవెన్స్ లో కోత విధించింది. ఫేర్ ఫ్యామిలీస్ కాన్సెప్ట్‌కు పూర్వం దేశీయ విమానాల్లో ప్రయాణీకులు 25 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతి ఉండేది. కాగా ఇప్పుడు దానికి ఎయిర్ ఇండియా మార్పులు చేసింది.
'ఎకానమీ క్లాస్‌లోని దేశీయ రూట్‌లలో 'కంఫర్ట్' మరియు 'కంఫర్ట్ ప్లస్' కేటగిరీ ప్రయాణీకులు ఇప్పుడు 15 కిలోల బ్యాగేజీ అలవెన్స్‌ను పొందుతారు. అయితే 'ఫ్లెక్స్' 25 కిలోల అలవెన్స్‌ను అందిస్తుంది. ఇక దేశీయ రూట్లలో బిజినెస్ క్లాస్ బ్యాగేజ్ అలవెన్స్ 25 నుంచి 35 కిలోల వరకు ఉంటుంది. అంతర్జాతీయ విమానాలలో మాత్రం ఇది మారుతూ ఉంటుంది' అని సంస్థ ప్రతినిధి తెలిపారు.


Click it and Unblock the Notifications