నేడు గురువారం 242 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో విషాదకరంగా కూలిపోయింది. లండన్‌కు వెళ్తున్న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ మధ్యాహ్నం 1.39 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఇలాంటి దురదృష్టకర సంఘటనలలో విమాన ప్రమాద బీమా (Flight Accident Insurance) ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీ విమాన ప్రయాణ ప్రమాదాల నుండి ఆర్థిక రక్షణను అందించడానికి రూపొందించిన ఒక ప్రత్యేక రకమైన ఇన్సూరెన్స్.

విమాన ప్రమాద బీమా అంటే ఏమిటి: విమాన ప్రమాద బీమా అనేది విమాన ప్రయాణంలో ప్రమాదవశాత్తు గాయాలు, వైకల్యం లేదా మరణం సంభవించినప్పుడు ఆర్థిక రక్షణను అందిస్తుంది. అత్యవసర పరిస్థితులలో వైద్యం, తాత్కాలిక లేదా శాశ్వత వైకల్యం ఇంకా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఇన్సూరెన్స్ ప్రయోజనాలను ఇది కవర్ చేస్తుంది. కొన్ని పాలసీలు అత్యవసర తరలింపు ఖర్చులను కూడా భరిస్తాయి, దీని ద్వారా తక్షణ వైద్య సహాయం ఇంకా రవాణాకు సహాయపడుతుంది. ఈ కవరేజ్ వైద్య బిల్లులు, రికవరీ ఖర్చులు అలాగే ఆదాయ నష్టం వంటి ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.
విమాన ప్రమాద బీమా వర్సెస్ vs సాధారణ ప్రయాణ బీమా: విమాన ప్రమాద బీమా కేవలం విమాన ప్రయాణంలో జరిగే ప్రమాదాలపై దృష్టి సారించగా, సాధారణ ప్రయాణ బీమా ట్రిప్ రద్దు, పోగొట్టుకున్న సామాను లేదా ఇతర ప్రయాణ సంబంధిత అత్యవసర పరిస్థితులలో వైద్యం వంటి చాల రకాల నష్టాలను కవర్ చేస్తుంది. ప్రయాణికులు బీమా అవసరాలను ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ రెండింటి మధ్య తేడాని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
విమానయాన సంస్థలు అందించే బీమా: ప్రమాదం జరిగినప్పుడు విమానయాన సంస్థలు కొంత పరిహారాన్ని అందిస్తాయి, కానీ వాటి కవరేజ్ ఎక్కువగా పరిమితంగా ఉంటుంది. విమాన ప్రమాద బీమా అదనపు ఆర్థిక రక్షణను అందిస్తుంది, విమానయాన సంస్థలు అందించే వాటికి మించి పునరావాసం, వైద్య చికిత్సలు లేదా వైకల్యం కారణంగా నష్టాల వంటి ఖర్చులను భరిస్తుంది.
విమాన ప్రమాద బీమా దేనిని కవర్ చేయదు: విమాన ప్రమాద బీమాలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు, అనారోగ్యం వల్ల మరణాలు, శస్త్రచికిత్స సమయంలో మరణం లేదా మాదకద్రవ్య అధిక మోతాదు కారణంగా సంభవించే మరణాలు సాధారణంగా కవర్ చేయవు. పాలసీదారులు కవరేజ్ పరిధిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి పాలసీ నిబంధనలను క్షుణ్ణంగా సమీక్షించడం అలాగే కవరేజ్ పరిమితులు, మినహాయింపులను తెలుసుకోవడం చాలా అవసరం.


Click it and Unblock the Notifications