ఇంజిన్ లో తలెత్తిన సాంకేతిక కారణం వల్ల విమానాన్ని రష్యా రాజధాని మాస్కో నుంచి 10 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల నగరమైన మగడాన్‌కు మళ్లించబడింది. అయితే వీరిని గమ్యస్థానానికి చేర్చేందుకు ఎయిర్ ఇండియా ముంబై నుంచి మగడాన్‌కు ఫెర్రీ ఫ్లైట్‌ను షెడ్యూల్ చేసింది. కానీ రెగ్యులేటరీ సమస్యల కారణంగా రీప్లేస్‌మెంట్ ఫ్లైట్ ఆలస్యమైంది.
అక్కడ పరిమిత సౌకర్యాల కారణంగా చాలా మంది స్థానిక పాఠశాలలు, వసతి గృహాల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. వారిలో ఎక్కువ మంది వృద్ధులు ఉండటంతో గంటలు గడుస్తున్న కొద్ది వారికి అవసరమైన మందులు అందుబాటులో లేక, శాఖాహారులకు ఎంపికలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి స్థానిక భాష రాకపోవటంతో అధికారులతో చర్చించటం ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ఎయిర్ ఇండియాకు రష్యాలో కంపెనీ సిబ్బంది లేనందున పూర్తి స్థాయిలో సహాకారం అందిచటం కుదరటం లేదని తెలుస్తోంది.

దీనిని చక్కదిద్దేందుకు ఎయిర్ ఇండియా, రష్యా అధికారులు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్తంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రం మీదుగా యూఎస్ వెస్ట్ కోస్ట్‌లోకి ఎయిర్ ఇండియా విమానాలు ప్రయాణిస్తాయి. రష్యన్ గగనతలంపై నుంచి ప్రయాణించలేని ఇతర విమాన సంస్థల కంటే ఎయిర్ ఇండియాకు ఇది గణనీయమైన ప్రయోజనాన్ని అందిస్తుందని తెలుస్తోంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications