For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID 19: కరోనా కిట్స్ రవాణాకు ఎయిరిండియా విమానాలు

|

ఇండియా లాక్ డౌన్ నేపథ్యంలో రవాణావ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో కరోనా కిట్స్‌ను, మెడిసిన్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్స్ వంటి అత్యవసర వస్తువులు ఎయిరిండియా విమానాల ద్వారా ఆసుపత్రులకు అందిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అత్యవసర ప్రాతిపదికన ఈ విమానాల ద్వారా తరలిస్తున్నట్లు తెలిపారు.

కరోనా దెబ్బ: కొద్ది నెలల్లో చమురు నిల్వలకు స్థలం ఉండదుకరోనా దెబ్బ: కొద్ది నెలల్లో చమురు నిల్వలకు స్థలం ఉండదు

ఈ నగరాలకు పంపించాం..

ఈ నగరాలకు పంపించాం..

ఐసీఎంఆర్ రూపొందించిన కరోనా కిట్స్‌ను ఢిల్లీ నుంచి ఐజ్వాల్, కోల్‌కతా, హైదరాబాద్ తదితర నగరాలకు ఇప్పటికే తరలించామన్నారు. ముంబై నుంచి పుణే, బెంగళూరు, తిరువనంతపురం తదితర నగరాలకు, ఆ తర్వాత కోల్‌కతా నుంచి దిబ్రూగర్‌కుకు పంపిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. శనివారం నాడు ఈ ఎమర్జెన్సీ వస్తువులను పంపించారు.

కార్గో మేనేజ్‌మెంట్ గ్రూప్

కార్గో మేనేజ్‌మెంట్ గ్రూప్

బోయింగ్ 787, A320 ద్వారా వీటిని పంపించినట్లు ఎయిరిండియాకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. దేశవ్యాప్తంగా అత్యవసర వస్తువులు తరలించేందుకు ఎయిర్ కార్గో మేనేజ్‌మెంట్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి శుక్రవారమే వెల్లడించారు. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసరాల మెడికల్ ఎక్విప్‌మెంట్స్ తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఈ మార్గాల్లో..

ఈ మార్గాల్లో..

ఢిల్లీ-ముంబై-ఢిల్లీ, ఢిల్లీ-ఇంఫాల్-ఢిల్లీ, ఢిల్లీ-రాయ్‌పూర్-భువనేశ్వర్-ఢిల్లీ, కొల్‌కతా-అగర్తాల-కొల్‌కతా, ముంబై-పుణే-రాయ్‌పూర్-ముంబై మార్గాలలో విమానాలు ఆపరేట్ చేస్తున్నట్లు చెప్పారు. మిగతా రూట్లలోను ఆపరేట్ చేస్తారు. ఐజ్వాల్, కోల్‌కతా, హైదరాబాద్ వంటి ముఖ్య నగరాలకు పంపించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

ప్రయాణీకుల తరలింపులోనూ ఎయిరిండియా

ప్రయాణీకుల తరలింపులోనూ ఎయిరిండియా

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎయిరిండియా కీలక పాత్ర పోషిస్తోంది. చైనా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ప్రభుత్వరంగ సంస్థ ఎయిరిండియా మన దేశానికి తరలించింది. ఎయిరిండియా విమానం 314 మంది ఇజ్రాయెల్‌వాసులను తెట్ అవివ్ నగరానికి తరలించింది. దీంతో ఇజ్రాయెల్.. ఎయిరిండియాకు థ్యాంక్స్ చెప్పింది.

English summary

COVID 19: కరోనా కిట్స్ రవాణాకు ఎయిరిండియా విమానాలు | Air India operating cargo flights to move medicines, medical equipment

National carrier Air India and its regional arm Alliance Air are operating a host of cargo charter flights -- mostly with medical equipment and medicines - on several routes on Saturday, an Air India spokesperson said.
Story first published: Sunday, March 29, 2020, 10:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X