ఎయిర్ ఇండియా కు రూ.22 వేల కోట్ల నష్టం.. టాటా సన్స్ ఆందోళన.. కీలక సమావేశానికి ముందు సమీక్ష..

Air India Losses: ఎయిర్ ఇండియా ఆర్థిక పనితీరు, భవిష్యత్ ప్రణాళికలపై టాటా సన్స్ బోర్డు కీలక సమావేశానికి ముందు సమీక్ష నిర్వహించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ల సమీకృత నికర నష్టం ఏకంగా రూ. 22,238 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ. 10,859 కోట్లుగా ఉండగా.. కేవలం ఒక్క ఏడాదిలోనే ఇది రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు కంపెనీ ఆదాయం కూడా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తగ్గిపోయింది. ఇంధన ఖర్చులు పెరగడం, అంతర్జాతీయ మార్గాల్లో గగనతల ఆంక్షలు, విమాన సరఫరాలో జాప్యం వంటి బయటి సవాళ్లతో పాటు విదేశీ మారకద్రవ్య నష్టాలు కూడా సంస్థ ఆర్థిక స్థితిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి.

ఈ నేపథ్యంలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, నోయెల్ టాటాతో పాటు ఇతర సీనియర్ బోర్డు సభ్యులు హరీష్ మన్వానీ, అనిత మారంగోలీ జార్జ్, సౌరభ్ అగర్వాల్ గురుగ్రామ్‌లోని ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వారు అక్కడి శిక్షణ అకాడమీని, ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌ను కూడా పరిశీలించారు.

Air India Air India Loss Air India 22000 Crore Loss Tata Sons Tata Sons Board Meeting Air India Financial Performance Air India Financial Results Air India Business News Tata Group Air India Crisis Air India Turnaround Plan Aviation Industry India Indian Aviation Sector Air India Latest News Tata Group Business News 22000

ఈ సమీక్ష సందర్భంగా ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ తెవోల్డే గెబ్రమారియం సంస్థ ప్రస్తుత ఆర్థిక స్థితి, భవిష్యత్ ప్రణాళికలపై బోర్డుకు ప్రజెంటేషన్ ఇచ్చారు. అక్టోబర్ 1, 2026న క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో బాధ్యతలు స్వీకరించిన గెబ్రమారియం, ఖర్చులను తగ్గించడం, నెట్‌వర్క్‌ను పునర్వ్యవస్థీకరించడం, వైడ్-బాడీ విమానాల కార్యకలాపాలను విస్తరించడం, అంతర్జాతీయ మార్కెట్ వాటాను తిరిగి పొందడంపై దృష్టి సారించారు.

Also Read

ఖర్చులను నియంత్రించేందుకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ల మధ్య కొన్ని విభాగాలలో సమన్వయం పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు సంస్థల్లో వేర్వేరుగా ఉన్న పరిపాలన, సాంకేతికత, కొనుగోళ్లు, ఇంజనీరింగ్ నిర్వహణ వంటి సహాయక విభాగాల వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా అనవసర ఖర్చులను తగ్గించాలని భావిస్తున్నారు.

అదే సమయంలో రెండు బ్రాండ్లు వేర్వేరు ప్రయాణికుల వర్గాలకు సేవలందిస్తూ తమ వాణిజ్య పనితీరును మెరుగుపరుచుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఖర్చు తగ్గింపు అవకాశాలను గుర్తించేందుకు వివిధ విభాగాల అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.

టాటా సన్స్‌లో అంతర్గత అభిప్రాయభేదాలు, టాటా సన్స్ లిస్టింగ్ అంశం, ఎయిర్ ఇండియాతో పాటు డిజిటల్ మరియు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాల పనితీరుపై జరుగుతున్న చర్చల మధ్య ఈ సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. ఎయిర్ ఇండియాలో సహ-వాటాదారుగా ఉన్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థ పరివర్తన ప్రణాళికకు మద్దతుగా నిలుస్తూ, దీర్ఘకాలిక లాభదాయకత కోసం టాటా సన్స్‌తో కలిసి పనిచేస్తోంది.

దీర్ఘకాలిక విస్తరణ లక్ష్యాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నష్టాలను తగ్గించడమే ఇప్పుడు ప్రధాన సవాలుగా మారింది. విమానాల వినియోగాన్ని మెరుగుపరచడం, అంతర్జాతీయ విమానాల ద్వారా ఆదాయాన్ని పెంచడం, సేవల నాణ్యతను కాపాడుతూనే వ్యయ నియంత్రణ సాధించడం ద్వారా సంస్థను గాడిలో పెట్టేందుకు బోర్డు నిర్ణయాలు, కొత్త సీఈఓ వ్యూహాలు కీలకంగా మారనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+