Ayodhya News: మరోవారం రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్ జన ప్రవాహంతో మునిగిపోనుంది. రామనామంతో దద్దరిల్లనుంది. అవును ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శ్రీరాముని గుడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ అయోధ్యకు క్యూ కట్టనున్నారు.
ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లలో అటు ప్రభుత్వాలు ఉండగా.. మరో పక్క ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విమాన సర్వీసులను ఏర్పాటు చేసే పనిలో దేశీయ విమానయాన సంస్థలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే ప్రైవేటు రంగానికి చెందిన ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్ కంపెనీలు ఈ వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో ఉన్నాయి.
ఇండిగో: డిసెంబరు 30న అయోధ్యలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన తర్వాత.. ఇండిగో జనవరి 6 నుంచి ఢిల్లీ టూ అయోధ్యకు విమాన సర్వీసును ప్రారంభించింది. అలాగే అహ్మదాబాద్-అయోధ్య రూట్ ఫ్లైట్ కూడా ప్రారంభమైంది. అలాగే జనవరి 15 నుంచి ముంబై-అయోధ్య మార్గంలో విమానాలను ప్రారంభించే యోచనలో ఉంది.

స్పైస్‌జెట్: దేశీయ విమానయాన సంస్థ జనవరి 21న దేశ రాజధాని ఢిల్లీ నుంచి అయోధ్య మధ్య ప్రత్యేక విమానాన్ని నడపనుంది. అలాగే ఫిబ్రవరి 1 నుంచి అయోధ్యకు విమానయాన సంస్థ సాధారణ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అలాగే చెన్నై నుండి ప్రతిరోజూ, ముంబై నుంచి వారానికి ఆరు సార్లు, బెంగళూరు నుంచి వారానికి నాలుగు సార్లు విమాన సేవలను నడపాలని నిర్ణయించింది.

ఎయిర్ ఇండియా(AI)ఎక్స్‌ప్రెస్: ప్రస్తుతం టాటాల యాజమాన్యంలో నడుస్తున్న ఎయిర్‌లైన్ కంపెనీ జనవరి 17 నుంచి అయోధ్యకు.. బెంగళూరు, కోల్‌కతా నుంచి విమానాలను నడపనుంది. అలాగే అయోధ్య-ఢిల్లీ మధ్య విమాన సర్వీసును ప్రారంభించారు.

ఇదిలా ఉండగా అయోధ్యలోని పవిత్ర కార్యక్రమానికి వీఐపీలు వస్తున్న తరుణంలో దాదాపు 100 చార్టర్డ్ విమానాలు అయోధ్య విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 2016-17 సంవత్సరంలో రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్య 59.97 లక్షల నుంచి 2022-23 నాటికి 96.02 లక్షలకు చేరుకున్నట్లు వెల్లడించారు. అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీప్రారంభించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications