Independence Day 2024: ఎయిర్ ఇండియా ఫ్రీడమ్ సేల్.. స్వాతంత్ర దినోత్సవ ఆఫర్లతో ప్రత్యర్థులకు చెక్..
AirIndia News: ఏళ్ల తరబడి పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అందుకే ఆగస్ట్ 15 వస్తుందంటే యావత్ దేశం తిరంగా రంగులతో కళకళలాడిపోతుంది. ఇటీవల సామాజిక మాధ్యమాలు విరివిగా ప్రజల్లోకి వెళ్లిన నేపథ్యంలో.. దీన్ని పురస్కరించుకుని ఆయా సంస్థలు కస్టమర్లకు పలు ఆఫర్స్ అందిస్తున్నాయి.
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా 'ఫ్రీడం సేల్' అనౌన్స్ చేసింది. భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మేరకు ప్రత్యేక సేల్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎక్స్‌ప్రెస్ లైట్ ధరలు స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికి గుర్తుగా రూ.1,947 నుంచి అందిస్తోంది. ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది.

'మా #FreedomSaleతో 77 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను సెలబ్రేట్ చేసుకునేందుకు మాతో చేరండి' అంటూ ఎయిర్‌లైన్స్ తన X ఖాతాలో పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ ప్రయాణానికిగాను ఆగస్టు 5 వరకు వినియోగదారులు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలలో 30 సెప్టెంబర్ 2024 వరకు జర్నీ చేయవచ్చు.
ఈ సేల్‌లో ఢిల్లీ-జైపూర్, బెంగళూరు-గోవా మరియు ఢిల్లీ-గ్వాలియర్ వంటి ప్రముఖ గమ్యస్థానాలపై తగ్గింపు ధరలు లభిస్తున్నాయి. ఇవే కాకుండా 15 అంతర్జాతీయ మరియు 32 దేశీయ గమ్యస్థానాలను కవర్ చేసే విధంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్‌లో ప్రత్యేక విక్రయ ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా యాడ్-ఆన్ ప్యాక్‌లపై గరిష్ఠంగా 47 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తోంది.
ఆఫర్‌లో భాగంగా కేటాయించిన సీట్లు అమ్ముడైపోతే, సాధారణ ఛార్జీలు వర్తిస్తాయి. కాబట్టి ప్రయాణీకులు త్వరపడాలని ఎయిర్‌లైన్స్ సూచించింది. చెల్లింపు అనంతరం రీఫండ్‌లు అనుమతించబడవని యూజర్లు బుకింగ్‌కు ముందే గమనించాల్సి ఉంటుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న విధంగా టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి.


Click it and Unblock the Notifications