flight tickets Offers: విమాన ప్రయాణీకులకు దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ శెలవుల సీజన్ లో మరింత ఎక్కువగా ప్రయాణాలు చేసేందుకు వీలుగా.. ఆఫర్లను ప్రకటించింది. బస్సు, రైలు ప్రయాణ ధరలకే ఫ్లైట్ టిక్కెట్స్ అందిచేందుకు రెడీ అయింది.
టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం ఆఫర్స్ రిలీజ్ చేసింది. జనవరి 8, 2024 నుంచి ఏప్రిల్ 12, 2024 వరకు ప్రయాణించేందుకు వీలుగా వీటిని డిజైన్ చేసింది. ఇందుకోసం డిసెంబర్ 25, 2023 వరకు చేసే బుకింగ్స్ పై "బంపర్ సేల్" నిర్వహిస్తోంది.

'దేశీయ విభాగంలో ఛార్జీలు 1,799 వద్ద ప్రారంభమవుతాయి. ఇందులో ఢిల్లీ-జైపూర్, చెన్నై-బెంగళూరు, బాగ్‌డోగ్రా-కోల్‌కతా, కొచ్చి-బెంగళూరు, హైదరాబాద్-గోవా వంటి ప్రముఖ రూట్‌లు కవర్ అవుతాయి. ఈ మార్గాలతో పాటు పలు కీలక అంతర్జాతీయ రూట్లలోనూ తగ్గింపు ధరలతో టిక్కెట్స్ ఆఫర్ చేస్తున్నాం' అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎయిర్ ఇండియా తన మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో టాటా న్యూ రివార్డ్స్ మరియు ఎక్స్‌ప్రెస్ ఎహెడ్ సర్వీసెస్‌ని ఒకేచోటికి చేర్చింది. తద్వారా భోజనం, సీట్లు, బ్యాగేజీలపై ప్రత్యేకమైన డీల్స్ తో పాటు క్యాన్సిలేషన్ ఫీజు మినహాయింపులు వంటి అదనపు ప్రయోజనాలను కస్టమర్‌లు పొందే అవకాశం కల్పించింది. విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, డిపెండెంట్స్ మరియు సాయుధ దళాలకు ప్రత్యేక ఛార్జీలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications