పైలెట్ ముందే పసిగట్టినా.. అంతా క్షణాల్లోనే..గాల్లోనే పేలిపోయిన ఎయిర్ ఇండియా విమానం

Air India Flight Crashes at Ahmedabad: గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. 242 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులున్న ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. ఫ్లైట్‌ భూమిని తాకగానే ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి.

కుప్పకూలిన వెంటనే విమానం పేలిపోగా.. దట్టంగా పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకుని సిగ్నల్ కోల్పోయింది. ఆ సమయంలో దాదాపు 174 నాట్ల వేగంతో ప్రయాణిస్తోంది. ప్రమాదం తర్వాత విమాన శిథిలాలు విమానాశ్రయం బయటి సరిహద్దు గోడ దగ్గర పడ్డాయి.

Air India plane crash Ahmedabad airport crash London-bound Air India flight Air India emergency landing plane accident India 243 passengers Air India Indian aviation accident Ahmedabad flight crash flight crash news air crash India Air India flight disaster airline emergency India aviation incident Ahmedabad 243 Air India Flight

తాజాగా అహ్మాదాబాద్‌లో విమానం కూలిన ఘ‌ట‌న‌పై ఎయిర్ ఇండియా(Air India) స్పందించింది. త‌న ఎక్స్ అకౌంట్‌లో ప్ర‌మాదం గురించి పోస్టు చేసింది. ఫ్ల‌యిట్ AI171 కూలిన‌ట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది. అహ్మాదాబాద్ నుంచి లండ‌న్ గాట్విక్‌కు ఆ విమానం వెళ్తున్న‌ట్లు ఎయిర్ ఇండియా కంపెనీ వెల్ల‌డించింది. జూన్ 12వ, 2025 తేదీన ప్ర‌మాదం జరిగిందని ప్ర‌స్తుతం ఆ దుర్ఘ‌ట‌న‌కు చెందిన స‌మాచారాన్ని సేక‌రిస్తున్నామ‌ని, వీలైనంత త్వ‌ర‌లో ఆ విష‌యాల‌ను త‌మ ఎక్స్ ఖాతాలో వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

ఈ విషాద సంఘటనలో మరణించిన వారికి ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో భాధితుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఘటనా స్థలంలో అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సహాయం చేయడానికి, బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలను అందించడానికి మేము మా శక్తి మేరకు ప్రతిదీ చేస్తున్నామని ఎన్ చంద్రశేఖరన్ అన్నారు, అత్యవసర సమాచారం కోసం సహాయక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చంద్రశేఖరన్ తెలియజేశారు.

ప్రమాదం ఎప్పుడు జరిగింది: గురువారం మధ్యాహ్నాం 1.38 నిమిషాలకు 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్‌ 787-7 డ్రీమ్‌ లైనర్‌ విమానం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరింది. అయితే ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే దాదాపు 1.43ని. ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైంది.సుమారు 825 అడుగుల ఎత్తుకు వెళ్లగానే క్రాష్‌ ల్యాండ్‌ అయ్యింది. అనంతరం నేరుగా ఓ చెట్టును ఢీ కొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించి విమానం మొత్తం మంటల్లో కాలిపోయింది. ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ అయిన కొన్ని నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్‌ పరిధిలోనే ప్రమాదానికి గురైనట్లు డీజీసీఏ ప్రకటించింది.

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తక్షణ రక్షణ, సహాయ చర్యలకు ఆదేశించారు. గాయపడిన ప్రయాణికుల చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఆయన, త్వరిత వైద్య సహాయం కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రధాన కార్యదర్శి పంకజ్ జోషి, సీనియర్ కార్యదర్శులను కోరారు.

ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ: విమాన ప్రమాదం (Plane Crash)పై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు (Rammohan Naidu), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah)తో ఫోన్‌లో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్‌ చేయాలని కేంద్రమంత్రులను ప్రధాని ఆదేశించారు.

పౌర విమానయానమంత్రి ప్రకటన: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పౌర విమానయానమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అత్యంత అప్రమత్తంగా ఉన్నామని, వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని వెల్లడించారు. అన్ని విమానయాన, అత్యవసర ప్రతిస్పందన సంస్థలను త్వరితంగా , సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించాని తెలిపారు. రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, వైద్య సహాయం సంఘటనా స్థలానికి చేరుకునేలా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటోన్న సమయంలోనే పైలెట్లు ప్రమాదాన్ని పసిగట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. వారు వెంటనే ఎయిర్ ట్రాఫిక్క కంట్రోల్ కు సమాచారం ఇచ్చారు. MAYDAY కాల్ చేశారు. అత్యంత తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో మాత్రమే పైలెట్లు ఈ కాల్ చేస్తుంటారు. I need help అంటూ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. ఆ తరువాత విమానంతో ఏటీసీకి సంబంధాలు తెగిపోయాయి. ఏటీసీ పదే పదే సమాచారాన్ని పంపించినప్పటికీ కాక్ పిట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

ఆ వెంటనే భారీ శబ్దం రావడం, మంటలు చెలరేగడం, దట్టమైన పొగ వెలువడటంతో ఎయిర్ పోర్ట్ అధికారులను ఆందోళనకు గురి చేసింది. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు, పది మంది క్యాబిన్ సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. కెప్టెన్ సుమీత్ సబర్వాల్ కమాండ్‌గా వ్యవహరించగా, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కో ఫైలుట్ గా ఉన్నారు. కెప్టెన్ సబర్వాల్ 8,200 గంటల పాటు విమానాన్ని నడపగా.. కోపైలట్ 1,100 గంటలు విమానాన్ని నడిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+