Air India Tragedy: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా ఈ విషాదకర ఘటన నిలిచింది. ఈ దుర్ఘటనలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ఘోర ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఏఐ171 విమాన ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరి కథ దేశ ప్రజల గుండెను పిండేస్తోంది.
ఈ ఘోర విషాదంపై ఎయిరిండియా (Air India) కీలక ప్రకటన చేసింది. ఏఐ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో (ఏఐ171) ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించింది. ప్రమాదం నుంచి ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా.. 12 మంది సిబ్బంది ఉన్నారని పేర్కొంది.
వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చగీస్ వాసులు, కెనడా దేశస్థుడు ఒకరు ఉన్నారని ప్రకటించింది. ఇక ఎయిర్ ఇండియా విమానం మెడికల్ కాలేజీ భవనంపై కూలిపోవడంతో 24 మంది మెడికోలు చనిపోయారు. దీంతో ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది.

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ఎయిరిండియా యాజమాన్య సంస్థ టాటా గ్రూప్ వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారి వైద్య ఖర్చులన్నింటినీ తామే భరిస్తామని స్పష్టం చేసింది.ఈ మేరకు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి మా వంతుగా తోడ్పాటు అందిస్తామనిని చంద్రశేఖరన్ తన ప్రకటనలో వివరించారు.

ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో అందరూ ప్రాణాలు కోల్పోగా..విశ్వాశ్ కుమార్ రమేశ్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విశ్వాశ్ కుమార్ విమానంలో 11ఏ నంబర్ సీటులో ఎడమవైపున ఉన్న అత్యవసర ద్వారం పక్కన కూర్చుని ఉండగా.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం గాల్లోనే ముక్కలైపోయిందని తెలిపారు. దీంతో తన సీటు విమానం నుంచి విడిపోయి దూరంగా ఎగిరిపడిందని ఆయన తెలిపారు. విమానం ముక్కలైనప్పుడు తాను సీటు బెల్టుతో ఉండగానే బయటకు ఎగిరిపడ్డానని బయటకు దూకలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ ప్రయాణికుడు ట్రామా వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
యువతి ప్రాణాలను నిలబెట్టిన పది నిమిషాల ఆలస్యం: భూమి చౌహాన్ అనే యువతి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిరిండియా ఫ్లైట్ AI171 కు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే ఆమె ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో సకాలంలో విమానాశ్రయానికి చేరుకోలేకపోయారు. కేవలం 10 నిమిషాల ఆలస్యం వల్ల ఆమె ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఆమె ఎయిర్ పోర్టుకు చేరుకునే లోపే.. ఫ్లైట్ టేకాఫ్ అయి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనపై మాట్లాడలేకపోతున్నా. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ దేవుడికి ధన్యవాదాలు. గణపతి బప్పానే నన్ను కాపాడాడు. పది నిమిషాలు ఆలస్యం కావడం వల్ల నేను విమానం ఎక్కలేకపోయాను. విమాన ప్రమాద విషయాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదని ఆమె ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
తండ్రికి ఇచ్చిన మాటను నిలుపుకోలేక: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలెట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతి చెందిన సంగతి విదితమే. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని, పైలట్ ఉద్యోగం మానేసి చూసుకుంటానని తండ్రికి మాట ఇచ్చారు. కానీ తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే ఘోర విమాన ప్రమాదంలో ఆయన మరణించారు.

మాజీ ముఖ్యమంత్రికి కలిసిరాని లక్కీ నంబర్: గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీకి ఆయన ఎంతగానో ఇష్టపడే లక్కీ నంబర్ కలిసిరాలేదు. ఆ నంబరే ఆయన ప్రాణాలను బలితీసుకుంది. మాజీ సీఎం విజయ్ రూపానీ 1206ను అదృష్ట సంఖ్యగా భావిస్తుంటారు. స్కూటర్ల నుంచి కార్ల వరకు అన్నివాహనాలకు ఆయన అదే నంబర్ వాడుతారు. 6 నెలలో 12 వ తేదీన మాజీ సీఎం విమాన ప్రమాదంలో మరణించడంతో లక్కీ నంబర్ ఆయన జీవితాన్ని ముగించి వేసింది. లండన్‌లో ఉన్న కూతుర్ని కలిసేందుకు ఆయన విమానంలో బయలు దేరారు. ఈలోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

కాబోయే డాక్టర్లు ప్రపంచానికి వీడ్కోలు: అహ్మదాబాద్‌లోని బీజే వైద్య కళాశాల హాస్టల్ భవనంపై ఎయిరిండియా విమానం కూలిపోవడంతో అక్కడ ఉన్న కాబోయే డాక్టర్లు చాలామంది తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వీరిలో చాలా మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. ప్రస్తుతం శిథిలాలను తొలగిస్తూ మృతదేహాలను వెలికి తీస్తున్నారు.

లండన్ లో సెటిల్ అవుదామనుకుని తిరిగి రాని లోకాలకు: ఈ ఘోర విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన ఓ డాక్టర్ కుటుంబం మొత్తం మరణించింది.డాక్టర్ కోమి వ్యాస్ అనే డాక్టర్ తన భర్తతో కలిసి లండన్ లో సెటిలవ్వాలని ఆలోచనతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి విమానం ఎక్కారు. అయితే లండన్ లో సెటిలవ్వకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. విమానం ఎక్కిన అనంతరం జోషి తన భార్యా, పిల్లలతో కలిసి ఆనందంగా సెల్ఫీ తీసుకొన్నారు. విమాన ప్రమాదం వారి ఆశల్ని చిదిమేసింది.
భర్తను చూడకుండానే కన్నుమూసిన నవ వధువు: పెళ్లి అనంతరం మొట్టమొదటిసారి తన భర్తను కలవబోతుందన్న ఆశ నెరవేరకుండానే ఓ నవ వధువు విమాన ప్రమాదంలో మృతి చెందింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications