Air India Express: దేశీయ విమానయాన రంగంలో పెద్ద ప్రయాణం చేసేందుకు టాటాలు ప్రయత్నిస్తున్న వేళ అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో నిన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్రూ ఉద్యోగుల్లో ఒక విభాగం ఏకకాలంలో అనారోగ్య కారణాల సాకుతో సెలవు తీసుకున్నారు. ఇది కంపెనీకి పెద్ద డ్యామేజ్ చేసిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి కంపెనీకి చెందిన 300 మంది ఉద్యోగులు ఒకేసారి సిక్ లీవ్ తీసుకుని తమ మెుబైలో ఫోన్లను స్విచాఫ్ చేయటం పెద్ద సమస్యకు దారితీసింది. దీని వల్ల కంపెనీ ఏకంగా 76కి పైగా విమాన సేవలను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో టాటాలు క్రమశిక్షణ చర్యలకు దిగారు. తోకజాడించిన దాదాపు 30 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే రానున్న కాలంలో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చాలా మంది ఉద్యోగులు టాటాలు కొత్తగా తెచ్చిన ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నట్లు సమాచారం.

సంస్థలో ఉద్యోగులపై వివక్ష చూపుతున్నారని సదరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే ఉన్నత స్థాయికి ప్రమోట్ అయ్యేందుకు పరీక్షలు క్లియర్ చేసినప్పటికీ తమకు తక్కువ స్థాయి ఉద్యోగాలను కంపెనీ అందిస్తోందని వాపోతున్నారు. ఇదే క్రమంలో కంపెనీ తమకు చెల్లించే పరిహారం ప్యాకేజ్ లో సైతం అనేక మార్పులు చేసిందని అంటున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంక్షోభం టాటా గ్రూప్‌కు తాజా ఇబ్బందిగా మారింది. టాటాలకు చెందిన పూర్తి-సేవ క్యారియర్ విస్తారా తమ పే ప్యాకేజీల్లో మార్పులపై పైలట్ల నిరసనల కారణంగా అంతరాయాలను ఎదుర్కొన్న ఒక నెల తర్వాత ప్రస్తుతం మరో ఇబ్బందిని ఎదుర్కొంటోంది.
మాస్ లీవ్ వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడానికి యాజమాన్యం సిబ్బందితో చర్చలు జరుపుతున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి నిన్న తెలిపారు. తొలగించిన ఉద్యోగులకు పంపిన నోటీసు ప్రకారం వారు కావాలనే పనికి దూరంగా ఉన్నారని, ఇందులో ఏ విధమైన సమర్థనీయమైన కారణం లేదని విమానయాన సంస్థ పేర్కొంది. క్రూ కాలాలని చేసిన పని వల్ల కంపెనీకి ఆర్థిక పరమైన, పేరు ప్రఖ్యాతలకు నష్టం కలిగించిందని, ప్రజా ప్రయోజనాలను విధ్వంసం చేసిందని పేర్కొంది. కావాలని సిక్ లీవ్ పెట్టడం విమాన సేవలు నడవకుండా, కంపెనీ సేవలకు అంతరాయం కలిగించడానికి ఒక సాధారణ అవగాహనతో సమిష్టి చర్యగా టాటా గ్రూప్ పరిగణించింది.
దీనికి ముందు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకునే సంస్థ విమానయాన సంస్థ యాజమాన్యానికి లేఖ రాసింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన న్యూదిల్లీ రీజినల్ లేబర్ కమిషనర్ అషోక్ పెరుమాళ్ల ఉద్యోగులు చెప్పిన విషయాలు వాస్తవమేనని గుర్తించారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ యాజమాన్యం ఎటువంటి బాధ్యతాయుతమైన నిర్ణయాధికారులను ఎలాంటి రాజీ ప్రక్రియలకు పంపలేదని తెలిపారు. అలాగే కార్మిక చట్టాల దుర్వినియోగం, ఉల్లంఘనలు స్పష్టంగా కనిపించాయని అషోక్ తెలిపారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications