Air India Express Flash Sale: విమాన ప్రయాణం చేయాలనీ లేదా విమానం ఎక్కాలని కలలు కనే వారికి శుభవార్త. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పరిమిత కాలానికి 'ఫ్లాష్ సేల్' ప్రకటించింది. ఈ బంపర్ ఆఫర్ కింద దేశీయ విమానాల ఛార్జీ కేవలం రూ.1250 నుండి ప్రారంభమవుతాయి. అంటే దేశవ్యాప్తంగా ఒక నగరం నుండి మరొక నగరానికి విమాన ఛార్జీ కేవలం రూ.1250 నుండి మొదలవుతాయి. అలాగే విదేశాలకు వెళ్లడానికి బుకింగ్ చార్జీలు కూడా రూ.6131 నుండి స్టార్ట్ అవుతాయి. ఈ రెండు రకాల బుకింగ్‌లను 25 మే 2025 వరకు చేసుకోవచ్చు.

వెబ్‌సైట్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇండియాలోని మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ లైట్ విమాన ప్రయాణానికి ఛార్జీ రూ.1250 నుండి ప్రారంభమవుతుంది. ఈ కేటగిరీలో బ్యాగ్ చెక్-ఇన్ లేకుండా విమాన టికెట్ అప్షన్ ఉంది. ఎక్స్‌ప్రెస్ వాల్యూ ధర రూ.1375 నుండి మొదలవుతుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ఇంకా ఇతర ప్రముఖ బుకింగ్ సైట్స్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.
అంతర్జాతీయ విమానాల టికెట్స్ కేవలం రూ.6,131 నుండి స్టార్ట్ : ఈ ఫ్లాష్ సేల్ కింద అంతర్జాతీయ మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ లైట్ ధర రూ.6131 నుండి ఉంటాయి. అదేవిధంగా ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఇంకా ఎక్స్‌ప్రెస్ ఫ్లెక్స్‌లకు ఆఫర్ రూ.6288 అలాగే రూ.7,038 నుండి ప్రారంభమవుతుంది. విదేశీ విమానాలకు సంబంధించిన ఈ ఆఫర్లు 2025 ఆగస్టు 6, 12 అండ్ 20 తేదీలోని టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది.
airindiaexpress.com వెబ్‌సైట్ ద్వారా చేసే ఎక్స్‌ప్రెస్ లైట్ బుకింగ్‌లపై ఎటువంటి సౌలభ్య (convenience ) చార్జెస్ వసూలు చేయడం లేదని కంపెనీ తెలిపింది. ఎక్స్‌ప్రెస్ లైట్ బుకింగ్ కింద ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా 3 కిలోల వరకు బరువున్న అదనపు క్యాబిన్ బ్యాగ్‌ను ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా దేశీయ విమానాలలో 15 కిలోల బ్యాగుకు రూ. 1,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అంతర్జాతీయ విమానాలలో 20 కిలోల బ్యాగుకు రూ. 1,300 అదనంగా కట్టాల్సి ఉంటుంది.
వీరికి ప్రత్యేక ఆఫర్ : ఇవి కాకుండా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో లాయల్టీ మెంబర్లకు గొప్ప ఆఫర్లు ఇస్తుంది. లాగిన్ అయిన మెంబర్లకు 10 కిలోల అదనపు చెక్-ఇన్ బ్యాగ్ ఇంకా 3 కిలోల అదనపు క్యారీ-ఆన్ బ్యాగ్ పై 25% తగ్గింపు కూడా లభిస్తుంది. కంపెనీ విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సైనిక సిబ్బంది అలాగే వారి కుటుంబ సభ్యులకు ఈ ప్రత్యేక డిస్కౌంట్స్ అండ్ ప్రయోజనాలను అందిస్తోంది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications