Air India సంచలన నిర్ణయం.. ఆ దేశాలకు విమానాల సంఖ్య తగ్గింపు..!

Air India: టాటాల కిందకు వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా ఫేట్ మారిపోయింది. ఈ క్రమంలో తాజాగా కంపెనీకి ఉన్న రద్దీ కారణంగా కొన్ని రూట్లలో విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. సిబ్బంది, విమానాల కొరతతో ఎయిర్ ఇండియా తాత్కాలికంగా.. ఒమన్, దుబాయ్, అబుదాబి, ఖతార్‌లకు విమానాల ఫ్రీక్వెన్సీని తగ్గించాలని నిర్ణయించింది.

ఏప్రిల్ చివరి వారం నుంచి మే చివరి వరకు.. ఢిల్లీ - మస్కట్, ఢిల్లీ - దుబాయ్, ఢిల్లీ - అబుదాబిల మధ్య ఎయిర్ ఇండియా రెండు వైపులా ఒక వారపు విమానాన్ని రద్దు చేసిందని సమాచారం. నెట్‌వర్క్‌ అలైన్మెంట్ కారణంగా ఎయిర్ ఇండియా విమానాల రద్దు జరిగినట్లు ఒక అధికారి తెలిపారు. ఏప్రిల్ 29 నుంచి మే 27 వరకు శనివారాల్లో తన వారపు ఢిల్లీ-మస్కట్ విమానాలను, ఏప్రిల్ 30 నుంచి మే 28 వరకు ఆదివారం వరకు ఢిల్లీ-దోహా విమానాలను నిర్వహించదు.

air-india

అలాగే ఢిల్లీ-దుబాయ్ విమానాలను మే 2 నుంచి మే 30 వరకు మంగళవారం, మే 3 నుంచి మే 31 వరకు ఢిల్లీ-అబుదాబి విమానాలను బుధవారాల్లో నడపదు. ఎయిర్ ఇండియా ఈద్-ఉల్-ఫితర్ తర్వాత మధ్యప్రాచ్యానికి విమానాలను తగ్గిస్తుంది ఎందుకంటే.. ఆ దేశాల్లో ఈదా సెలవుల తర్వాత ట్రాఫిక్ బాగా పడిపోతుంది. ఇదే సమయంలో ఇండియాలో స్కూళ్లకు వేసవి సెలవులు ఉంటున్నందున దేశీయ ట్రాఫిక్ పెరుగుతుందని ఎయిర్ ఇండియా అధికారి వెల్లడించారు.

అంతర్జాతీయ కార్యకలాపాలను వేగంగా విస్తరించాలని చూస్తున్న ఎయిర్ ఇండియా టాటా గత ఆరు నెలలుగా సిబ్బందితో పాటు విమానాల కొరతతో పోరాడుతోంది. ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానాలకు పైలట్‌ల కొరత కూడా ఉన్నందున.. డిమాండ్‌ను తీర్చడానికి తాత్కాలిక ప్రాతిపదికన విదేశీ పైలట్‌లను నియమించుకోవాలని కంపెనీ చూస్తోంది. అలాగే.. జూన్ 2022లో ఎయిర్‌లైన్ అందించే స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని(VRS) 1,500 మంది ఉద్యోగులు అంగీకరించిన తర్వాత విమానయాన సంస్థ సిబ్బంది కొరతను ఎదుర్కొంటోందని తెలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+