ఎయిరిండియాకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వచ్చే జనవరి నెలలో ఎయిరిండియాని టాటా సన్స్ సొంతం చేసుకోనుంది. అంతకంటే ముందే రాజీనామా చేయాలని ఎయిరిండియా బోర్డు సభ్యులకు సూచనలు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. గత వారంలో ఈ సూచన వచ్చిందని సమాచారం వచ్చే నెలలో జరగనున్న సమావేశంలో వారు రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'బోర్డులోని ఏడుగురు సభ్యులను రాజీనామా చేయాలని కోరారు.
ఇందులో నలుగురు ఫంక్షనల్ డైరెక్టర్లు, ఇద్దరు ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు. ఎయిరిండియాను కొనుగోలు చేసిన కంపెనీ చేతిలోకి వెళ్లడానికి ముందే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు రాజీనామా చేయాలి. వచ్చేసారి జరగనున్న చివరి బోర్డు సమావేశంలో వీరు రాజీనామాలు సమర్పించాలి' అని ఎయిర్ లైన్స్ అధికారి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.
రాజీనామా చేయాలని నవంబర్ 15వ తేదీన సూచన వచ్చిందని తెలుస్తోంది. ఎయిర్ లైన్స్ బోర్డ్ మీటింగ్ డిసెంబర్ రెండో నెలలో లేదా మూడో నెలలో ఉండనుంది. ఆ సమయంలోనే ఏడుగురు బోర్డు మెంబర్స్ రాజీనామా చేయనున్నారు. రాజీనామా చేసే వారిలో అధికార బీజేపీకి చెందిన సయ్యద్ జాఫర్ కూడా ఉన్నారు. ఆయన ఎయిరిండియా నాన్-అఫీషియల్ డైరెక్టర్‌గా ఉన్నారు.

టాటా సన్స్ ఎయిరిండియా బిడ్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. టాటా సన్స్ రూ.18వేల కోట్లకు ఈ బిడ్‌ను గెలుచుకుంది. ఎయిరిండియాలో 100 శాతం వాటాను, గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ AISATS, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 50 శాతం వాటా దక్కించుకుంది. రూ.14,718 కోట్ల వ్యాల్యూ కలిగిన ల్యాండ్, బిల్డింగ్ వంటి నాన్ కోర్ అసెట్స్ ఈ ట్రాన్సాక్షన్ పరిధిలోకి రావడం లేదు. ఈ మొత్తం గవర్నమెంట్ హ్యాండ్లింగ్ కంపెనీ ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్ (AIAHL) ట్రన్సుఫర్ అవుతాయి. ఎయిరిండియా రుణ మొత్తం రూ.61,562 కోట్లుగా ఉంది.
ఈ రుణాల్లో టాటాలు రూ.15,300 కోట్లు భరిస్తుంది. మిగతా రూ.46,262 కోట్లుగా ఉంటుంది. ఇది కంపెనీని ప్రస్తుత, భవిష్యత్తు ఆర్థిక ప్రమాదం నుండి వేరు చేయడానికి ఇది ఎస్పీవీకి వెళ్తుంది. ఎయిరిండియా 68 సంవత్సరాల తర్వాత తిరిగి తన సొంత యాజమాన్యం చేతికి వెళ్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రయివేటీకరించేందుకు బిడ్డింగ్ నిర్వహించగా టాటా సన్స్ విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications