భారత ఏవియేషన్ రంగం అంతకంతకూ విస్తరిస్తోంది. ఏటా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్యలో పెద్ద ఎత్తున వృద్ధి కనిపిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా విమానయాన సంస్థలు సైతం అదే రీతిలో ఎయిర్ క్రాఫ్ట్ ల సంఖ్యను పెంచుతున్నాయి. వినియోగదారులకు మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తూ, మార్కెట్ లో తమ స్థానం సుస్థిరపరచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎయిర్ ఇండియా - ఎయిర్ బస్ మధ్య ఈరోజు జరిగిన డీల్ సైతం ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది.

భారీ ఒప్పందం:
ఎయిర్ బస్ కు చెందిన 250 విమానాలను ఎయిర్ ఇండియా కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరినట్లు టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. వీటిలో A350 వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్ లు 40, A320 neo నారో బాడీ విమానాలు 210 ఉన్నట్లు చెప్పారు. ఈ చారిత్రక ఒప్పందంలో భాగంగా అంగీకార పత్రంపై సంతకాలు చేసినట్లు తెలిపారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా తమ సామర్థ్యాన్ని మరింత పెంచుకోనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో వాణిజ్య విమానాలను భారత్ లో తయారుచేయాలని దేశం ఆశిస్తోందని గుర్తుచేశారు.

ల్యాండ్ మార్క్ డీల్:
వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పాల్గొన్నారు. ఈ డీల్ ను 'ల్యాండ్ మార్క్' ఒప్పందంగా మోడీ అభివర్ణించారు. భారత్, ఫ్రాన్స్ మధ్యనున్న సత్సంబంధాలకు దీనిని ఉదాహరణగా పేర్కొన్నారు. దేశీయ విమానయాన రంగం అభివృద్ధికి ఫ్రాన్స్ ఎంతగానో సహకరిస్తోందని కొనియాడారు. కాగా అత్యంత ఆధునిక, సమర్థవంతమైన సాంకేతికతను భారత్ కు అందిస్తూ.. మేడ్ ఇన్ ఇండియాలో భాగం కావడం పట్ల మాక్రాన్ హర్షం వ్యక్తం చేశారు.

త్వరలో MRO హబ్ గా..
విమానయన రంగంలో భారత్ మూడవ అతిపెద్ద మార్కెట్ అని ప్రధాని గుర్తుచేశారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 147కి పెరిగాయని వెల్లడించారు. రానున్న 15 ఏళ్లలో దాదాపు 2 వేలకు పైగా ఎయిర్ క్రాఫ్ట్ లు దేశానికి అవసరమవుతాయన్నారు. 'మేకిన్ ఇండియా-మేక్ ఫర్ ది వరల్డ్' కింద భారత్ లో పెట్టుబడులకు ద్వారాలు తెరిచామన్నారు. వివిధ దేశాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. భారత్ ను త్వరలో MRO(మెయింటెనెన్స్, రిపేర్, ఆపరేషన్స్) హబ్ గా మార్చాలని చూస్తున్నట్లు ప్రకటించారు.

ఎయిర్ ఇండియాలో నూతనోత్సాహం:
నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుంచి టాటా గ్రూపు జనవరి 2022లో స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. అనంతరం పూర్వ వైభవం తీసుకురావడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. 17 ఏళ్ల క్రితం కొత్త విమానాలు కొనుగోలు ఈ సంస్థ.. టాటాల చేతిలోకి వచ్చిన ఏడాదికే 250 ఎయిర్ క్రాఫ్ట్ ల ఆర్డర్ తో నూతనోత్సాహాన్ని నింపుకుంటోంది. Vihaan.AI పేరిట ఓ రోడ్ మ్యాప్ ను రూపొందించి, మొత్తం వైడ్ బాడీ ఫ్లీట్ ఇంటీరియర్ ను పునరుద్ధిరించడానికి 400 మిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications