ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ అయిన అలయన్స్ ఎయిర్ విమాన ప్రయాణికులకు సమ్మర్ బొనాంజా ఆఫర్ ను ప్రకటించింది. ఈ వేసవిలో అలయన్స్ ఎయిర్ పాకెట్ ఫ్రెండ్లీ ఛార్జీలను అందిస్తున్న సంస్థ 60 వేల టికెట్లను అతి తక్కువ రేట్ లో ఆఫర్ చేస్తోంది. అలయన్స్ ఎయిర్ అందిస్తున్న అద్భుతమైన ఆఫర్ల వల్ల 999 రూపాయల నుండి విమాన ప్రయాణానికి టికెట్ ధరలు లభిస్తున్నాయి .

అలయన్స్ ఎయిర్ మూడు రోజుల సమ్మర్ బొనాంజా
మూడు రోజులపాటు ఈ ఆఫర్ ను అందిస్తున్న అలయన్స్ ఎయిర్ మార్చి 13 నుండి అంటే నేటి నుండి మార్చి 15వ తేదీ వరకు ప్రయాణాలు చేయదలచుకున్న వారికి బుకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ బుకింగ్ ద్వారా ప్రయాణికులు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి 2021 సెప్టెంబర్ 30వ తేదీ మధ్య తమ ప్రయాణం చేయదలచిన ప్రదేశాలకు ప్రయాణించేలా అవకాశం కల్పిస్తుంది. టికెట్లు ఎవరు ముందుగా బుక్ చేసుకుంటారో వారికే సీట్లు ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ ను అందిస్తోంది అలయన్స్ ఎయిర్.

వేసవి కాలంలో అద్భుతమైన ఆఫర్లతో అలయన్స్ ఎయిర్
ఢిల్లీ నుండి జైపూర్ కు లేదా ప్రయాగ్ రాజ్ కు, అహ్మదాబాద్ నుండి కాండ్లా కు , బెంగళూరు నుండి కొచ్చి లేదా కోజికోడ్ కు, హైదరాబాద్ నుండి బెలగాం కు పలు నగరాలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని అలయన్స్ ఎయిర్ ప్రకటించింది. ఇక ప్రయాణం తేదీలను మార్చుకోవడానికి ఒక వారం ముందు వరకూ అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఎయిర్ లైన్స్ ఒక ప్రకటన చేసింది . మొన్నటి వరకు కరోనా కారణంగా ప్రయాణాలు చేయాలంటే భయపడిపోయిన పర్యాటకులు అలయన్స్ ఎయిర్ అందిస్తున్న అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని సమ్మర్ బొనాంజా ఆఫర్లతో చూడాలనుకున్న ప్రాంతాలను ఎంచక్కా చూసేయండి. ఈ సమ్మర్ ను అలయన్స్ ఎయిర్ ఇచ్చే అద్భుతమైన ఆఫర్లతో ఎంజాయ్ చేయండి.

దేశంలో 43 గమ్య స్థానాలకు , మెట్రో నగరాలకు విమాన సర్వీసులు అందిస్తున్న అలయన్స్ ఎయిర్
అలయన్స్ ఎయిర్ దేశంలోని 43 గమ్యస్థానాలకు విమాన సేవలను నిర్వహిస్తుంది.
విమానాలు ఎక్కువగా టైర్ -2 మరియు టైర్ -3 నగరాలకు లేదా చిన్న నగరాలను మెట్రో హబ్‌లతో అనుసంధానించే వాటికి నడుస్తాయి. అలయన్స్ ఎయిర్ భారతదేశంలోని 43 గమ్యస్థానాలకు ఆగ్రా, అహ్మదాబాద్, అలహాబాద్, బెంగళూరు, బెలగావి, భావ్‌నగర్, భువనేశ్వర్, భుజ్, బికనీర్, కోయంబత్తూర్, చండీగడ్ , ఢిల్లీ , డెహ్రాడూన్, దిమాపూర్, డయ్యు , ధర్మశాల, గోవా, గోరఖ్పూర్, గౌహతి, గుల్బర్గా (కలబురగి), హైదరాబాద్, ఇంఫాల్, జబల్పూర్, జగదల్పూర్, జైపూర్, ఖౌలగు, ఖార్లగు , లుధియానా, మదురై, ముంబై, మైసూరు, నాసిక్, పంత్‌నగర్, పాసిఘాట్, పఠాన్‌కోట్, పూణే, రాయ్‌పూర్, తేజ్‌పూర్ లను కనెక్ట్ చేస్తూ విమాన సేవలను అందిస్తుంది .
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications