జూన్ నెలలో చాలా రకాల వస్తువుల ధరలు తగ్గాయి. అన్నింటిలో మొదటిది ఎల్‌పిజి సిలిండర్ల ధర తగ్గడం. రెండోది విమాన ఇంధనం ధర కూడా తగ్గడం. ఈ కట్ కూడా చాలా పెద్దదని చెబుతున్నారు. ప్రభుత్వ చమురు, గ్యాస్ కంపెనీలు ఇచ్చిన సమాచారం ప్రకారం, నేటి జూన్ 1 నుంచి విమాన ఇంధనం అంటే ATF ధరలు కిలోలీటర్‌కు 6,673.87 రూపాయలు తగ్గాయి.
ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ రోజు నుండి ఢిల్లీలో ఏటీఎఫ్ కిలోలీటర్‌కు 94,969.01 రూపాయలకు చౌకగా మారింది. అంతకుముందు మే 1న కిలోలీటర్‌కు రూ.749.25 చొప్పున ఏటీఎఫ్ రేట్లు పెంచారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌కు రూ.1,01,642.88కి పెరిగింది.ఇతర నగరాల్లో కూడా విమాన ఇంధనం ధర తగ్గింది. తాజా మార్పు తర్వాత, ముంబైలో ఏటీఎఫ్ ఇప్పుడు కిలోలీటర్‌కు రూ. 88,834.27 కు చేరింది.

నాలుగు మెట్రో నగరాలు పరిశీలిస్తే ప్రస్తుతం ముంబైలో మాత్రమే విమాన ఇంధనం చౌకగా అందుబాటులో ఉంది. అదేవిధంగా కోల్‌కతాలో ఏటీఎఫ్ ధరలు కిలోలీటర్‌కు రూ.1,03,715కి తగ్గాయి. నాలుగు మెట్రోలలో ఏటీఎఫ్ అత్యధిక ధర ఇదే. అదే సమయంలో ఏటీఎఫ్ చెన్నైలో కిలోలీటర్‌కు 98,557.14 రూపాయలకా ఉంది. చమురు కంపెనీలు తెలిపిన వివరాల ప్రకారం కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ప్రారంభంలో విమాన ఇంధన ధరలను సమీక్షిస్తాయి. కంపెనీలు మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రకారం విమాన ఇంధనం అంటే ఏటీఎఫ్ ధరను తగ్గించాలని లేదా పెంచాలని నిర్ణయించుకుంటాయి. అంతకుముందు గత నెల ఒకటో తేదీన, ఎటిఎఫ్ ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. విమానయాన సంస్థల అతిపెద్ద వ్యయం ఇంధనంపైనే. ATF రేట్ల మార్పుల ప్రత్యక్ష ప్రభావం విమానయాన ఛార్జీలపై కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో విమానయాన ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications