DA Hike: రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుతో సంతోషంలో లక్షల మంది
Railway Board DA Hike: కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ భారతీయ రైల్వేస్. పండుగ వేళ రైల్వే బోర్డు లక్షలాధి మంది ఉద్యోగులకు అతిపెద్ద శుభవార్తను తెలిపింది.
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగుల కరువు భత్యాన్ని 4 శాతం పెంచుతున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. తాజా నిర్ణయం ద్వారా 42 శాతంగా ఉన్న కరువు భత్యం 46 శాతానికి పెరిగింది. పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్ జూలై 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. ఉద్యోగులకు వచ్చే నెల జీతంలో పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు జూలై నుంచి ఇప్పటి వరకు బకాయిలను కలిపి చెల్లించనున్నారు. అలాగే ప్రధాని మోదీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంతివర్గం రైల్వే ఉద్యోగులకు 78 రోజుల జీతాన్ని బోనస్ రూపంలో పండక్కి అందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

గతవారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపును మోదీ సర్కార్ ప్రకటించగా.. ఈ వారం రైల్వే ఉద్యోగులకు అతిపెద్ద ప్రకటన వెలువడింది. కేంద్రం రైల్వే ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ చెల్లించాలని తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉందని ఆల్ ఇండియా రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ జనరల్ మేనేజర్‌లు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌లకు రైల్వే బోర్డు లేఖ రాసింది. కేంద్ర మంత్రివర్గం సుమారు రూ.15,000 కోట్ల బోనస్‌ను ఆమోదించిన ఐదు రోజుల తర్వాత రైల్వే బోర్డు నుంచి తాజా ప్రకటన రావటంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
ఉద్యోగ సంఘాలు సైతం తాజా నిర్ణయాన్ని స్వాగతించాయి. దీపావళికి ముందరే కేంద్రం నుంచి సానుకూల ప్రకటాలనుకోవటాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం స్తంభింపజేసిన జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు DA చెల్లింపు కోసం తన డిమాండ్‌పై ఒత్తిడి చేస్తూనే ఉంటామని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జనరల్ సెక్రటరీ ఎం రాఘవయ్య పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications