Bank Strike: వరుసగా రెండు రోజుల పాటు దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) బ్యాంక్ నవంబర్ 19న సమ్మెను ప్రకటించింది. దీనికి తోడు నవంబర్ 20 ఆదివారం కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి. అందువల్ల ముఖ్యమైన బ్యాంక్ పనులు ఉంటే ఈ రోజే పూర్తి చేసుకోవటం ఉత్తమం.

ఎందుకు సమ్మే..
బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, బ్యాంకు ఉద్యోగుల భద్రత సహా పలు డిమాండ్లపై ఉద్యోగులు సమ్మే చేస్తున్నారు. యూనియన్‌లో పనిచేస్తున్నందుకు బ్యాంకర్లను బలిపశువులకు గురిచేయడాన్ని నిరసిస్తూ బ్యాంకు యాజమాన్యాలు సమ్మెకు దిగనున్నాయి. బ్యాంక్ ఉద్యోగులపై దాడులు పెరిగాయని వారు ఆరోపిస్తున్నారు. దీంతో బ్యాంకు యాజమాన్యానికి వ్యతిరేకంగా, బ్యాంకు ఉద్యోగులకు అనుకూలంగా పోరాటం ప్రారంభమైంది. అందరూ ఏకతాటిపైకి వచ్చి దాడులను ప్రతిఘటించాలని వారు నిర్ణయించారు.

పెళ్లిళ్ల సీజన్లో..
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. దీనికి తోడు చాలా మంది ఆధ్యాత్మిక ప్రయాణాలు సైతం చేస్తుంటారు. ఈ సమయంలో బ్యాంకు ఉద్యోగుల సమ్మే కస్టమర్లకు తీవ్ర ఇబ్బందిని, అంతరాయాన్ని కలిగించవచ్చు. అందుకే అవసరమైతే ఒకరోజు ముందుగానే బ్యాంక్ ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ, బ్యాంక్ శాఖలోని పనులను పూర్తి చేసుకోవటం మంచిది. ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి.

ఉద్యోగుల తొలగింపులు..
AIBEA యూనియన్ నాయకులను సోనాలి బ్యాంక్, MUFG బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సర్వీసు నుంచి తొలగించినట్లు ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం తెలిపారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు ట్రేడ్ యూనియన్ హక్కులను నిరాకరిస్తున్నాయని, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకులు.. అనేక బ్యాంకింగ్ విధులను అవుట్‌సోర్స్ చేస్తున్నాయని వెంకటాచలం ఆగ్రహం వ్యక్తం చేశారు.

బదిలీలపై గరం..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్‌మెంట్ ఉద్యోగులను విచక్షణారహితంగా బదిలీ చేయడాన్ని వెంకటాచలం 'జంగల్ రాజ్'గా అభివర్ణించారు. ద్వైపాక్షిక సెటిల్‌మెంట్, బ్యాంకు వ్యాప్త సెటిల్‌మెంట్‌ను ఉల్లంఘించి 3,300 మందికి పైగా క్లర్క్‌లను ఒక కార్యాలయం నుంచి మరొక కార్యాలయానికి బదిలీ చేశారని ఆయన అన్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా యూనియన్ లోని బ్యాంక్ ఉద్యోగులు తమ నిరసనను రేపు తెలియజేయనున్నారు. ఇకనైనా యాజమాన్యాలు తమ తీరును మార్చుకోవాలని.. ఉద్యోగుల డిమాండ్లను వెంటనే తీర్చాలని వారు కోరుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications