భారతదేశంలోని ప్రధాన IT సేవల సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, HCLటెక్, టెక్ మహీంద్రా ఉద్యోగ నియామకాలపై గణనీయమైన మార్పులను ఎదుర్కొంటున్నాయి. FY21లో 50,000కు పైగా ఉన్న ప్రవేశస్థాయి ఉద్యోగుల నియామకం FY26 తొలి త్రైమాసికంలో కేవలం 4,787కు పడిపోయింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ ప్లాట్ఫామ్లు మరియు సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్ వంటివి సాధారణ టెక్నికల్ ఉద్యోగాలను తీసి వేస్తున్నదనే సంకేతం.

2025 జూన్ త్రైమాసికంలో టాప్ 5 ఐటీ కంపెనీల కలిపిన టీసీఎస్ ఒంటరిగా 6,071 ఉద్యోగులను నియమించినప్పటికీ, ఇతర ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగ సంఖ్య తగ్గడం కారణంగా మొత్తం ఉద్యోగ నియామకాల్లో దిగుబడి కనిపించింది. వివరాల్లోకి వెళ్తే, ఇన్ఫోసిస్ కేవలం 210 మంది ఉద్యోగులను చేరుస్తూ నియామకాలు చాలా తక్కువగా ఉన్నట్లు ఉంది. HCLటెక్ 269 మందిని తగ్గించగా, విప్రోలో 114 మంది ఉద్యోగులు మినహాయించబడ్డారు. టెక్ మహీంద్రా ఉద్యోగుల సంఖ్యలో అత్యధికంగా 1,111 మందితో తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలో, మొత్తం ఐటీ రంగంలోని ఉద్యోగ నియామకాలు మందగించాయనే విషయం స్పష్టం అవుతుంది.
ఇది కంపెనీల లెవెల్ 1 మరియు లెవెల్ 2 సపోర్ట్ రోల్లను AI ఆధారిత టూల్స్ మార్చడంతో, ప్రవేశస్థాయి టాలెంట్ డిమాండ్ని తీవ్రంగా తగ్గించింది. ఇప్పుడు IT సంస్థలు AI, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఫుల్-స్టాక్ డెవలప్మెంట్లో పూర్తిగా నైపుణ్యాలు కలిగిన మధ్యస్థ వృత్తిపరులను మాత్రమే కోరుతున్నాయి.
టెక్ సలహాదారు రామ్కుమార్ రామమూర్తి చెప్పినట్లుగా "నికర నియామకాలు (ఎంతమంది కొత్తగా ఉద్యోగంలో చేరారు) లేదా యుటిలైజేషన్ (ఉద్యోగులను ఎంతవరకు పని కోసం ఉపయోగిస్తున్నారు) లాంటి పాత పద్ధతులు ఇక IT రంగంలో వృద్ధిని చూపించలేవు" అంటే, కంపెనీ వృద్ధి చెందుతుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు కొత్త కోణంలో చూడాలి, పాత ప్రమాణాలు సరిపోవు అని ఆయన భావన.
భారతదేశ ఉన్నత విద్య వ్యవస్థపై మళ్లీ ఆలోచించడం అవసరం అని నిపుణులు చెబుతున్నారు. విద్య అనేది పాఠాలు నేర్పడమే కాక, సమస్యలను పరిష్కరించగల శక్తి, వివిధ విషయాలను కలిపి ఆలోచించే దృష్టి, క్రియేటివిటీ మరియు పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం (అనుకూలత) పై దృష్టి పెట్టేలా మారాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు.
ఇప్పటి నియామక విధానం కూడా మారింది. గతంలో పెద్ద ఎత్తున క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగులను నియమించుకున్న IT సంస్థలు, ఇప్పుడు ఎక్కువగా పెద్ద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కాంట్రాక్ట్లకు సంబంధించిన sporadic hiring కి మారాయి. దీనివల్ల కొత్త గ్రాడ్యుయేట్లు నిరుద్యోగంగా ఉండటం, అధిక పోటీ ఎదుర్కొనడం గమనించబడుతోంది.
నియామకాల వివరాల ఆధారంగా ఇది స్పష్టమవుతుంది:
FY21 Q1: 53,000కి పైగా ఫ్రెషర్ల నియామకం
FY22 Q1: సుమారు 60,000
FY23 Q1: సుమారు 22,000
FY26 Q1: 5,000కి తక్కువ
ఇది కేవలం తాత్కాలికంగా జరిగే విషయం కాదు, భారత IT రంగం లో దీన్ని మూల మార్పు (ఫండమెంటల్ చెంజ్) గా చూస్తున్నారు. అంటే, ఈ మార్పు ఇండస్ట్రీ మొత్తం నైపుణ్యాలు (skills) ఆధారంగా, కొత్త దిశగా మారిపోతోందని పరిశ్రమలోని వారు భావిస్తున్నారు.
ప్రస్తుతం IT రంగంలో ఉద్యోగ నియామకాలు తగ్గిపోవడం వల్ల ఆర్థికంగానూ, సామాజికంగానూ ప్రభావం పడుతోంది. ప్రతి సంవత్సరం భారత ఇంజనీరింగ్ కాలేజీలు లక్షల మందిని గ్రాడ్యుయేట్ చేస్తున్నా, ప్రవేశ స్థాయి (ఎంట్రీ లెవెల్) ఉద్యోగాలు తగ్గిపోవడంతో ఉద్యోగ సంక్షోభం ఎక్కువవుతోంది. విద్యా వ్యవస్థ మరియు పరిశ్రమలు కొత్త టెక్నాలజీ అవసరాలకు తగిన మార్పులు చేయకపోతే, ఈ సమస్య ఇంకా పెద్దదవుతుంది.
ఇటీవల Nasscom-McKinsey ఇచ్చిన నివేదిక ప్రకారం, భారత టెక్ ఉద్యోగులు ప్రతి 3-5 సంవత్సరాలకు కొత్త నైపుణ్యాలు (reskilling) నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆటోమేషన్ మరియు AI (జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల ఉద్యోగాల్లో భారీ మార్పులు వస్తున్నాయి.
దీంతో భారత IT రంగంలో AI ఆధారిత టెక్నాలజీలు ప్రవేశ స్థాయి ఉద్యోగాలపై ప్రభావం చూపుతుండగా, ఉద్యోగుల నైపుణ్యాలు, విద్యా విధానాల్లో పాత విధానాలను మార్చి కొత్త మార్గాలు ప్రారంబించాల్సిన అవసరం ఏర్పడుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications