కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత డిజిటల్ మౌలిక వసతులపై గ్లోబల్ పోటీ వేగంగా సాగుతున్న ఈ సమయంలో.. ప్రపంచం నలుమూలల నుండి డేటా సెంటర్ల నిర్మాణం కోసం పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రపంచదేశాలు పోటీ పడుతున్నాయి. అదే పోటీ ఇప్పుడు భారతదేశానికి చేరింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ అంశం వేడి పుట్టిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్‌ఫీల్డ్, డిజిటల్ రియాలిటీ సంయుక్తంగా విశాఖపట్నంలో "AI-స్థానిక" డేటా సెంటర్ హబ్‌ను నిర్మించేందుకు 11 బిలియన్ డాలర్లు (సుమారు రూ.92 వేల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఒక నెల ముందే గూగుల్, అదానీ గ్రూప్ కూడా అదే నగరంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికను వెల్లడించాయి. చిన్న విరామంలోనే మొత్తం $25 బిలియన్ల పెట్టుబడుల వైజాగ్ వైపు రావడంతో భారత డిజిటల్ భవిష్యత్తు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ వెలుగులోకి వచ్చింది.

ఈ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం గట్టిగానే కృష్టి చేసింది. ఇరవై సంవత్సరాల క్రితం చంద్రబాబు బెంగళూరును సవాలు చేస్తూ బై బై బెంగళూరు, హలో హైదరాబాద్ అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌ను అంతర్జాతీయ సాంకేతిక కేంద్రంగా మార్చారు. ఆయన దూరదృష్టితో మైక్రోసాఫ్ట్, GE వంటి దిగ్గజాలు భారతదేశంలో భారీగా పెట్టుబడులు హైదరాబాద్‌లో పెట్టాయి, సైబరాబాద్ అనే కొత్త జిల్లాను నిర్మించారు.
మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయింది, ఔషధ రంగం, రియల్ ఎస్టేట్ వేగంగా పెరిగాయి, నగరం ప్రపంచ పటంలో స్థానం సంపాదించింది.సాఫ్ట్‌వేర్ ఆధారిత ఆర్థికాభివృద్ధి నుంచి హార్డ్‌వేర్...ముఖ్యంగా డేటా సెంటర్లు, AI పరిశ్రమ వైపుకు చంద్రబాబు ఏపీని తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కొత్త రంగానికి ప్రత్యేకమైన సవాళ్లు కూడా ఉన్నాయి.
మొదటిది పర్యావరణం. డేటా సెంటర్లు భారీ విద్యుత్ వినియోగం, వేలలక్షల లీటర్ల నీటి అవసరం వంటి సమస్యలు పొంచి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్, సింగపూర్ వంటి ప్రాంతాలలో డేటా సెంటర్ విస్తరణ బ్లాక్‌అవుట్లు, నీటి కొరత, పర్యావరణ నాశనానికి దారితీసిన ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి భారతదేశం ప్రారంభం నుండే పునరుత్పాదక శక్తి, నీటి పునర్వినియోగం, పర్యావరణ సమీక్షలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంది.
రెండవది ఉద్యోగాల సృష్టి. మైక్రోసాఫ్ట్, GE వంటి సంస్థలు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చాయి. కానీ ఆధునిక డేటా సెంటర్లు ఎక్కువగా ఆటోమేటెడ్. AI తానే అనేక ఉద్యోగాలను భర్తీ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలకిష్టమయ్యే ప్రత్యక్ష ఉపాధి ఆశించలేమని పలువురు నిపుణులు భావిస్తున్నారు.
అయినప్పటికీ, నాయుడి తాజా ప్రయత్నం మరో అవకాశాన్ని సృష్టిస్తోంది. అదేంటంటే పశ్చిమ తీరం ఆధిపత్యంలో ఉన్న డేటా సెంటర్ రంగాన్ని తూర్పు తీరానికి మళ్లించడం. భారత డిజిటల్ భద్రతను బలోపేతం చేయడం, ఆంధ్రప్రదేశ్‌కు దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను అందించాలనే ధైర్యవంతమైన వ్యూహం ఇది.ఏదేమైనా AI తో నిండిన భవిష్యత్తుపై ఆయన పెట్టుబడి పెద్దదే. మరి ఈసారి ప్రయాణం ఆంధ్ర ప్రజలకు ప్రత్యక్షంగా లాభపడుతుందని ఆయన ఆశిస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications