జెన్ Z (1990ల మధ్య నుండి 2010ల ప్రారంభంలో జన్మించిన వారిని సూచించే తరం) ఈ రోజుల్లో ఎక్కువగా పనిచేయడం మానేసి ChatGPT లాంటి బాట్ మీద ఆధారపడుతున్నారు. వాళ్ల సమస్యలను ఇప్పుడేం మానవ మిత్రులతో మాత్రమే పంచుకోవడం లేదు. థెరపీ అనేది ఖరీదుగా మారడంతో అధిక సంఖ్యలో యువత తమ భావాలను చాట్‌బాట్‌లకు తెలుపుకుంటున్నారు. దీంతో AI చాట్‌బాట్‌లు వారి గోడును వినే దోస్తులుగా మారిపోయాయి. సంబంధాల్లో తలెత్తే గొడవలు నుంచి వర్క్ స్ట్రెస్ వరకు ఇలా అన్ని విషయాల్లో చాలా మంది AIని తమ ఫ్రెండ్ గా భావించి దాంతో పంచుకుంటున్నారు.
మొదట వృత్తి పరమైన టూల్ గా కనిపించిన ChatGPT లాంటి ప్లాట్‌ఫాములు ఇప్పుడు నలుగురి జీవితాలలో అసలు భాగంగా మారిపోయాయి.ఇంకా ఆసక్తికర మైన విషయం ఏంటంటే.. డబ్బు/ఆర్థిక నిర్ణయాలు కూడా ఇప్పుడు ఈ AI చాట్‌బాట్ లోకి మారిపోయాయి. Gen-Z, మిలీనియల్స్ (1981 మరియు 1996 మధ్య జన్మించిన వ్యక్తులు) వంటి యువత ఆర్థిక నిర్ణయాలను తీసుకునే ముందు ఎక్కువగా AI వైపే చూస్తున్నారు. దానిని అడిగి తెలుసుకుంటున్నారు. పొదుపు ఎలా చేయాలి? SIP ఎంత తగ్గింది, నా క్రెడిట్ స్కోర్ ఎలా మెరుగుపర్చాలి? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం ChatGPT ద్వారానే తెలుసుకుంటున్నారు.
ఆర్థిక సలహాల కోసం AI వినియోగం: దాదాపు 67% Gen Z, 62% మిలీనియల్స్ ఆర్థిక సలహాల కోసం AI వినియోగిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. CFA ఇన్స్‌టిట్యూట్ తాజా నివేదిక ప్రకారం, గత మూడు సంవత్సరాలలో గ్రాడ్యుయేట్ అయిన వారిలో 83 శాతం మంది కనీసం ఒకసారి వారి ఆర్థిక నిర్ణయం కోసం ChatGPTని సంప్రదించారని తెలిపింది. ఈ నేపథ్యంలో డబ్బు విషయాల్లో నిజంగా AI పై పూర్తిగా ఆధారపడమా? మన పరిస్థితిని, మన భయాలను, మన లక్ష్యాలను అర్థం చేసుకునే 'మానవ' సలహాదారుడు అవసరమా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.

సురేఖ వాణి కథ: 2024లో హైదరాబాద్ కి చెందిన ప్రైవేట్ టీచర్ సురేఖ వాణి ChatGPTని ఒక సింపుల్ ప్రశ్న అడిగింది. ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే.. ఐదు సంవత్సరాలలో నా పొదుపును రెట్టింపు ఎలా చేసుకోవచ్చు. దానికి ఛాట్ బాట్ చాలా నిశ్శబ్దంగా, కాన్ఫిడెంట్‌గా సమాధానమిచ్చింది. అది ఇచ్చిన సమాధానం ఏంటంటే.. 60 శాతం మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టండి... 40 శాతం స్టాక్స్‌లో పెట్టండి. అలాగే మిగిలితే Zomato, Paytm, Nykaa వంటి స్టాక్స్‌లో పెట్టండని సలహా ఇచ్చింది. ఆమె ఛాట్ బాట్ చెప్పినట్లుగా చేసింది. అయితే ఏడాది పూర్తయ్యేసరికి ఆమె పెట్టుబడిలో దాదాపు రూ. 40 వేలు నష్టం వచ్చింది. కారణమేమిటంటే.. ఈ స్టాక్స్ కొన్ని త్రైమాసికాల్లో బలహీనమైన ఫలితాలను రాబట్టడంతో పడిపోయాయి.
ఆ తర్వాత ఆమె నెత్తి నోరు బాదుకుంది. బాట్‌కి నేను ఎవరో తెలియదు. నా వయసు ఎంత, నా జీతం ఎంత, నాకు ఎలాంటి బాధ్యతలున్నాయి అన్నది తెలుసుకోకుండా అదొక సాధారణ సూచన ఇచ్చింది. నన్ను నిలువునా ముంచివేసింది. అది తెలుసుకుని తర్వాత నుంచి AIను కేవలం ప్రాథమిక పరిశోధన కోసం మాత్రమే ఉపయోగిస్తోంది. తుది నిర్ణయానికి మాత్రం ఫైనాన్షియల్ ప్లానర్ వద్దకే వెళ్తోంది.
అంజలి కథ: ఫుణేకు చెందిన ట్రేడర్ అంజలికి AI ఒక పెద్ద ఆయుధంలా వాడుకోవాలనుకుంది. AIని అడగాలంటే ముందుగా నేనే దానికి అసలు సమస్యని అర్థమయ్యేలా వివరించాలని తెలిపింది. ఇందుకోసం ఆమె మార్కెట్‌లోకి వెళ్లేముందు, కొన్ని గంటలు AIలో విచారణలు పెడుతుంది. ఎందుకు ఈ స్టాక్ పడింది? అంతర్జాతీయంగా ఎటువంటి ఆంక్షలు ఉన్నాయా? మంచి స్థాయిలో ఎంట్రీ ఎప్పుడు ఉంది? అని వివరాలు తెలుసుకుంటుంది. ఆమె గంటల్లో చేసుకునే విశ్లేషణలు మినిట్లలో గుర్తించి AI ఆమె ముందు ఉంచుతుంది. ఆమె ఏం చెబుతుందంటే.. AI నాకు మరో ఇచ్చే గీత, కానీ గీత మేనేజ్ చేయడంలో మానవ సహాయకుడు విలువ ఎంతో ఎక్కువ అని అంటోంది.
అసలు చిక్కు ప్రశ్న : AIని పూర్తిగా భర్తీ చేయాలా లేక పాక్షికంగా దాని సేవలు ఉపయోగించుకోవాలా అనే దానిపై నిపుణులు పలు అభిప్రాయాలు చెబుతున్నారు. వారి చెబుతున్న దాని ప్రకారం..AI ఎంత వేగంగా లెక్కల్ని లెక్కిస్తుంటే.. మానవ సలహాదారుడు కూడా అంతే వేగంగా మన భావాలను చదువుతాడని చెబుతున్నారు. ఉదాహరణకు మార్కెట్ 10 శాతం పడిపోయిన రోజు.. AI దిగువకు సంబంధించిన లెక్కలే చూపుతుంది. కానీ మానవ సలహాదారుడు ఇది సాపేక్షంగా సాధారణ దిద్దుబాటు... ఇప్పుడే వెనక్కి తగ్గితే తప్పు అని భరోసా ఇస్తాడు. అయితే ఏఐ మాత్రం పూర్తిగా పక్కకు వెళ్లండి అని చెబుతుందని అంటున్నారు.
నిపుణులు చెబుతున్న చిట్కా: ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారంటే.. AIను సహాయకుడిగా వాడుకోండి అంతే కాని సలహా ఇచ్చే నాయకుడిగా ఎన్నుకోకండి అని చెబుతున్నారు. మీ monthly బడ్జెట్ ట్రాక్ చేయడానికి, SIPలను పోల్చి చూసేందుకు, స్టాక్‌లపై ఆధారభూత విశ్లేషణ తీసుకురావడానికి AI అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇదే సమయంలో జీవితంలో కీలకమైన పార్ట్ ను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. నేను ఏ లక్ష్యానికి ఎంత పెట్టుబడి పెట్టాలి అనే దానిపై మానవ మాత్రుల సలహాలు తప్పకుండా అవసరమని సూచిస్తున్నారు.
ఇప్పుడు బ్యాంకులు, పెట్టుబడి సంస్థలు, ఫండ్ మేనేజర్లు ఎవరైనా తీసుకుని చూసినా ఏఐని ఉపయోగిస్తున్నారు. దాన్ని ఉపయోగించుకుని మానవ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే అవకాశాన్న పరిశీలిస్తున్నారు. అదే సమయంలో భారీ ఆస్తులు నిర్వహించే AMCలు (Asset Management Companies) మాత్రం కొంచెం విభిన్న దిశలో ఆలోచిస్తున్నాయి. వారు బయట అందుబాటులో ఉన్న AI టూల్స్ కంటే తమ అవసరానికి అనుగుణంగా ప్రత్యేక బాట్‌లను తయారు చేయాలని చూస్తున్నారు.
కంపెనీని అర్థం చేసుకోవడం AIకు ఇంకా రాలేదు: మోతీలాల్ ఓస్వాల్ AMCలో ఫండ్ మేనేజర్ అయిన వరుణ్ శర్మ చెబుతున్న వివరాల ప్రకారం.. ఒక మోడల్ లెక్క లైన్‌తో బాగుంటుంది, ఇంకొకటి హేతుబద్ధమైన అంశాలకు బాగుంటుంది. కానీ ఒక కంపెనీ మేనేజ్‌మెంట్ నాణ్యత ఎంత వరకు మెరుగ్గా నిర్వహిస్తోంది అనే విషయాన్ని AIతో పూర్తిగా తెలుసుకోవడం ఇప్పటికీ కష్టమేనని చెబుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే.. కంపెనీని అర్థం చేసుకోవడం AIకు ఇంకా సాధ్యపడలేదని అర్థం.
AIతో ప్రయోగాలు మొదలుపెట్టిన Zerodha : ఇక ట్రేడింగ్ ప్లాట్‌ఫాంల విషయానికి వస్తే, Zerodha లాంటి సంస్థలు ఇప్పటికే AIతో ప్రయోగాలు మొదలుపెట్టాయి.MCP (Model Context Protocol) ద్వారా యూజర్లు ట్రేడింగ్‌కి సంబంధించిన డేటాను చాటింగ్ రూపంలో అడగవచ్చు. నా ఖాతా ప్రదర్శన ఎలా ఉందని అడిగితే ఐఏ సమాధానం ఇస్తుంది. ఎలాంటి స్టాక్స్ ఈ వారం అత్యధికంగా నష్టపోయాయని అడిగితే లిస్టు మీ ముందు ఉంచుతుంది.
సరైన ప్రశ్నలు వేయగలిగేంత ఆర్థిక అవగాహన మీకు ఉంటే AI ఒక బలమైన తోడుదారు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ అసలు మీరు ఎంత ఆదాయం, ఎన్ని బాధ్యతలు, ఎలాంటి లక్ష్యాలతో ఉన్నారో క్లియర్‌గా తెలియకపోతే AI ఇచ్చే సలహా సరైనదే అనుకుని వెళితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications