AI Stock Recommendations: ఇండియా ఈక్విటీ మార్కెట్లలో ప్రస్తుతం రిటైల్ పెట్టుబడిదారుల పార్టిసిపేషన్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది తాము ఏ రంగాల్లో పెట్టుబడి పెట్టాలనే నిర్ణయాల కోసం ఏఐ సాధనాలను సైతం విరివిగా వినియోగిస్తున్నారు. బ్రోకరేజీలు, సెబీ లిస్టెడ్ అనలిస్టుల అభిప్రాయాలను పోల్చిచూసేందుకు సైతం వీటిని వినియోగిస్తున్నారు.
వాస్తవానికి పెట్టుబడి నిర్ణయాలు నష్టాలతో కూడుకున్నవి కాబట్టి.. సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్లను సంప్రదించటం ఉత్తమం. అయితే ప్రస్తుత కాలంలో సాంకేతికతను చాలా మంది దీనికి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తూ ఏఐ చాట్‌బాట్‌లను వినియోగిస్తున్నారు. ఇవి అందించే ఆసక్తికరమైన అంశాల ప్రకారం 2025లో ఏ రంగాల్లో పెట్టుబడి పెట్టాలనే విషయాలపై అవి సమాధానం ఇస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఫార్మా, ఇన్ ఫ్రా రంగాలు 2025 పెట్టుబడికి ఉత్తమంగా తాజా శోధనల్లో తేలింది.

ముందుగా ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీ భారతీయ స్టాక్ మార్కెట్లలో 2025లో పెట్టుబడికి ఉత్తమ రంగాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ క్రమంలో ఆసక్తికరంగా టెక్నాలజీ, ఐటీ రంగాలు బెట్టింగ్ వేసేందుకు ఉత్తమమైనవిగా ముందు స్థానంలో నిలిచాలు. ప్రజల నుంచి దేశంలో డిజిటల్ స్వీకరణ పెరిగటం, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, AI-ఆధారిత పరిష్కారాలకు డిమాండ్ పెరుగుదల ఈ రంగం భవిష్యత్తుకు మంచి అవకాశలను కల్పిస్తోందని చాట్ జీపీటీ వివరణ అందించింది.
అలాగే చాట్ జీపీటీ గ్రీన్ ఎనర్జీ రంగానికి రెండవ స్థానాన్ని అందించింది. 2030 నాటికి ప్రభుత్వాలు 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై దృష్టి సారించటం రంగాన్ని ప్రోత్సహిస్తోందని పేర్కొంది. ఇదే క్రమంలో గూగుల్ జెమినీ కూడా టెక్నాలజీ రంగంపై తన అభిప్రాయాన్ని పెట్టుబడికి సానుకూలమైనదిగా పేర్కొంది. రానున్న కాలంలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ పెట్టుబడులకు అనుకూలమైన సంకేతాలను అందిస్తోందని పేర్కొంది.
ఇదే క్రమంలో జెమినీ ఇన్ ఫ్రా రంగాన్ని 2025 కోసం పెట్టుబడిదారులకు ఉత్తమ ఎంపికగా పేర్కొంది. ప్రభుత్వం ఇన్ ఫ్రా పెట్టుబడులతో రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలపై భారీగా ఖర్చుచేయటాన్ని దీనికి కారణంగా ఏఐ టూల్ పేర్కొంది. దీంతో నిర్మాణం, మెటల్స్ ఇతర అనుబంధ రంగాల్లోని కంపెనీలు ఉత్తమ పెట్టుబడి ఎంపికలుగా పేర్కొంది. అయితే ఇవి పూర్తిగా విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా ఉన్నట్లు తేలింది. రెలిగేర్ బ్రోకింగ్ నుంచి అజిత్ మిశ్రా ప్రకారం వాణిజ్య ఉద్రిక్తతలు 2025లో ఐటీ, రియల్టీ రంగాలపై ఒత్తిడిని కలిగిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదే క్రమంలో మరో దేశీయ బ్రోకరేజ్ అరిహంత్ క్యాపిటల్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, శ్రుతి జైన్ మాట్లాడుతూ రానున్న 2-3 ఏళ్ల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టూరిజం, వ్యవసాయ-వినియోగం, గ్రామీణ వినియోగ థీమ్‌లు మంచి వృద్ధిని సాధిస్తాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇక్కడ చివరికి పెట్టుబడిదారులు తమ విచక్షణకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయటం ఉత్తమం.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications