AI రాకతో ఉద్యోగలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనులన్నీ శరవేగంగా జరిగిపోతున్నాయి. కృత్రిమ మేధ అనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు ఒక నిత్యావసరంగా మారిపోయింది.చాలా మంది దీని ప్రభావంతో తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. మానవ వనరులను ధ్వంసం చేస్తూ ఏఐ ముందుకు దూసుకువెళుతోంది. తాజాగా AI కారణంగా తెలివైన విద్యార్థుల ఉద్యోగాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి హెచ్చరిస్తున్నారు.
'రిచ్ డాడ్ పూర్ డాడ్' అనే ప్రసిద్ధ పుస్తక రచయిత, వ్యవస్థాపకుడు రాబర్ట్ కియోసాకి కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. AI కారణంగా భవిష్యత్తులో చాలా మంది 'తెలివైన విద్యార్థుల' ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని ఆయన హెచ్చరించారు. సాంప్రదాయ ఉద్యోగాలు, విద్యా మార్గాలు మునుపటిలాగా ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వవని కియోసాకి అభిప్రాయపడ్డారు. అప్పులు తీసుకొని చదువు పూర్తి చేసిన యువతకు.. తక్కువ ఉద్యోగ అవకాశాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇది శాపంలా మారనుందని హెచ్చరించాడు.

నాకు ఉద్యోగం లేకపోవడంతో AI నన్ను తొలగించలేదని కియోసాకి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్‌లో రాశారు. కాబట్టి యువత ఉద్యోగాల కంటే వ్యవస్థాపకత, పెట్టుబడితో వ్యాపారం చేయడం మంచిదని కియోసాకి చాలా కాలంగా వాదిస్తున్నారు. మారుతున్న ఈ కాలంలో ప్రజలు పాతమూసలో ఉండకూడదని కొత్త మార్గాలను కనుగొనాలని ఆయన సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా యువత ఆర్థిక మార్పులను అర్థం చేసుకుని, సాంప్రదాయ వ్యవస్థ నుండి బయటపడి కొత్త వ్యూహాలను అనుసరించాలని ఆయన కోరారు.
కాగా కియోసాకి తన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలో విద్య, ఉపాధి యొక్క సాంప్రదాయ నమూనాను వ్యతిరేకిస్తూ ఉంటాడు.తన పుస్తకంలో అతను జీవితంలోని రెండు పాత్రల కథను చెబుతాడు. ఒకటి 'పూర్ డాడ్' విద్య ఉపాధిపై ప్రాధాన్యత ఇవ్వగా, 'రిచ్ డాడ్' వ్యవస్థాపకత పెట్టుబడి మార్గాన్ని చూపిస్తుంది. కియోసాకి.. 'రిచ్ డాడ్' సలహాను అనుసరించి రియల్ ఎస్టేట్, బంగారం, వెండి మరియు ఇప్పుడు బిట్‌కాయిన్ వంటి డిజిటల్ ఆస్తులలో పెట్టుబడి పెట్టాడు. నేటి కాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి ఇదే ఏకైక మార్గం అని ఆయన చెబుతున్నారు.
ఈ విపత్కర కాలంలో ప్రజలు బాధితులుగా మారవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. AI కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదని, మొత్తం ప్రపంచంలోని శ్రామిక శక్తిని మార్చగల ఆర్థిక శక్తి అని కియోసాకి విశ్వసిస్తున్నారు. ప్రజలు తమ వ్యక్తిగత, ఆర్థిక అవగాహనను పెంచుకోవాలని, ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలను అవలంబించాలని ఆయన సలహా ఇస్తున్నారు.ఇక ధనవంతులు AI కి భయపడరు, వారు దానికి నిధులు సమకూరుస్తారు. పేదలు AI ని కలిగి ఉండరు, వారు దానితో పోటీ పడతారని పలువురు ఆయనకు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications