ఏఐ వల్ల యువతకు ఉద్యోగాలు దొరకడం కష్టమే? గోల్డ్‌మన్ సాక్స్ చెబుతున్న నిజం!

కొత్తగా కాలేజీ పూర్తి చేసిన యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈలోగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వారికి పోటీగా మారుతోంది. 2022లో ChatGPT లాంటి టూల్స్ ప్రవేశించినప్పటి నుంచి అమెరికాలోని టెక్ రంగం తన ఉద్యోగ వాటాను కోల్పోవడం ప్రారంభించింది. ఈ పరిణామాలు మన దగ్గర కూడా జరుగుతున్నాయి.

AI AI AI job impact Tech unemployment Youth skill development AI skills Prompt engineering Data analysis Machine learning Entry-level jobs White-collar jobs Future career opportunities

గోల్డ్‌మన్ సాక్స్ తాజాగా ఇచ్చిన డేటా ప్రకారం, టెక్ రంగంలో ఉద్యోగుల శాతం 2022 నవంబర్‌లో గరిష్ఠ స్థాయిని తాకినప్పటి నుంచి తగ్గుతూనే ఉంది. అప్పుడే చాట్‌జీపీటీ మార్కెట్లోకి వచ్చిన నెల. అప్పటి నుంచే టెక్ రంగంలోకి కొత్తగా వస్తున్న వారికి అవకాశాలు తగ్గుతున్నాయి.

2024 ప్రారంభం నుంచి, 20-30 ఏళ్ల వయసు గల యువతలో టెక్ రంగానికి సంబంధించిన నిరుద్యోగం నాలుగు రెట్లు వేగంగా పెరిగింది. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే కాదు, కొన్ని వైట్ కాలర్ ఉద్యోగాలు కూడా AI వల్ల తగ్గిపోతున్నాయని గోల్డ్‌మన్ స్పష్టంగా చెబుతోంది.

బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ జాన్ హట్జియస్ అంచనా ప్రకారం, వచ్చే దశాబ్దంలో అమెరికాలో 6%-7% ఉద్యోగాలు ఏఐ వల్ల దూరం కావొచ్చని అంచనా. అయితే, దీని వల్ల నిరుద్యోగ రేటు పెద్దగా పెరగదని, ఉద్యోగులు ఇతర రంగాలకు మారతారని ఆయన అభిప్రాయపడ్డారు.

టెక్ కంపెనీలు ఇప్పటికే తమ బృందాలను తగ్గించడం ప్రారంభించాయి. కంటెంట్, కస్టమర్ సపోర్ట్, ఆపరేషన్స్, హెచ్ఆర్ వంటి శాఖల్లో ఎఐ పనితీరు మెరుగవుతోందన్న కారణంగా ఉద్యోగులను తొలగించడం జరుగుతోంది. కానీ కంపెనీలు ఇవన్నీ "ఎఫిషియెన్సీ కోసం" చేస్తున్న చర్యలుగా పేర్కొంటున్నాయి. అదే సమయంలో వాటి ఆర్థిక పరిస్థితులు మాత్రం బలంగా ఉన్నాయి.

అంథ్రోపిక్‌ అధినేత డారియో అమోడెయి, అమెజాన్ సీఈఓ అండీ జెస్సీ వంటి ప్రముఖులు కూడా ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పూర్తిగా మానవులను భర్తీ చేస్తాయని ఓపెన్‌గా చెప్పేశారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు మాత్రం డిమాండ్‌లోనే ఉన్నారు. మెటా వంటి కంపెనీలు కోట్ల రూపాయల ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. లింక్డ్‌ఇన్ నివేదిక ప్రకారం, ఇటీవల గ్రాడ్యుయేట్ అయినవారిలో "ఏఐ ఇంజినీర్" టాప్ జాబ్ టైటిల్‌గా మారింది. అలాగే డేటా సెంటర్ టెక్నీషియన్, సిస్టమ్స్ ఇంజినీర్ వంటి ఉద్యోగాలు వేగంగా పెరుగుతున్నాయి.

భారతదేశంలో ప్రస్తుతం ఈ ప్రభావం అంత తీవ్రంగా లేదు. చాలామంది మల్టీనేషనల్ కంపెనీలు భారత్‌లో తమ కార్యాలయాలు పెంచుకుంటున్నాయి. అందువల్ల కొత్తగా ఉద్యోగాల అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ, దీన్ని చూసి అంతా సేఫ్ అని భావించకూడదు. ఏఐ దశలవారీగా అన్ని రంగాలపై ప్రభావం చూపనుందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.

సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, కస్టమర్ సర్వీస్, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ తయారీ, బేసిక్ కోడింగ్ టాస్కులు వంటి పనులు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సులభంగా చేయగలిగేలా మారిపోతున్నాయి. ఈ విభాగాల్లో రొజూ జరిగే పనులను AI టూల్స్ వేగంగా పూర్తి చేయగలవు. దాంతో, చాలా కంపెనీలు ఈ విధమైన పనులకు మానవ వనరులను తగ్గిస్తూ, ఆటోమేషన్‌ను ప్రాధాన్యంగా తీసుకుంటున్నాయి. ఇది ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను ప్రభావితం చేస్తోంది.

దీనికి పరిష్కారంగా, యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సహజీవనం చేసే కొత్త స్కిల్స్‌ను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు, AI ప్రాంప్ట్ ఇంజినీరింగ్, డేటా అనాలిసిస్, మిషన్ లెర్నింగ్, క్రియేటివ్ & స్ట్రాటజిక్ థింకింగ్ వంటి నూతన నైపుణ్యాలు భవిష్యత్‌ ఉద్యోగాల కోసం చాలా అవసరం అవుతున్నాయి. ఇప్పటికే ఉన్న కొంతమంది ఉద్యోగాలు AI వల్ల ఆటంకానికి గురవుతున్నా, అదే సమయంలో AI టూల్స్‌తో కలిసి పనిచేసే అనేక కొత్త అవకాశాలు కూడా తెరుచుకుంటున్నాయి. యువత ఈ మార్పును అర్థం చేసుకొని, తమ స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకుంటే, భవిష్యత్‌లో సురక్షితమైన, విలువైన ఉద్యోగాలను పొందగలుగుతారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+