భారత IT రంగంలో లేఅఫ్స్ పెరుగుతున్నా… AI వల్ల ఉద్యోగాలు పోవు అంటున్న గూగుల్ క్లౌడ్ CEO
టెక్ రంగంలో AI వేగంగా విస్తరిస్తోందని చాలా మంది ఉద్యోగులు భయపడుతున్నారు. కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, ఆటోమేషన్ సిస్టమ్స్ వలన అనేక టెక్ ఉద్యోగాలు రద్దు కావచ్చు, అని కొందరు నిపుణులు, ఉద్యోగులు భావిస్తున్నారు. కొత్త AI ప్రాజెక్టులు, చాట్ బోట్, కోడింగ్ సపోర్ట్ సిస్టమ్స్ వలన ఇంజినీర్లు, డేటా అనలిస్టులు, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులు భవిష్యత్తులో తమ స్థానం కోల్పోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే టెక్ రంగంలో AI కారణంగా ఉద్యోగాలు కోల్పోయే వార్తలు వస్తున్నప్పటికీ, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కూరియన్ అభిప్రాయం మాత్రం చాలా బిన్నంగా ఉంది. ఆయన చెబుతున్నది ఏంటంటే, AI ఉద్యోగాలను తొలగించదు బదులుగా ఉద్యోగులను మరింత సామర్థ్యవంతులవ్వడానికి సహాయపడుతుంది. భారతీయ మూలాల ఎగ్జిక్యూటివ్ అయిన కూరియన్, గూగుల్ వేగంగా పెరుగుతున్న క్లౌడ్ డివిజన్‌ను నడుపుతున్నారు. అయన అభిప్రాయం ప్రకారం, AI ఉద్యోగులను సులభతరం చేయడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగించుకోవాలి.

బిగ్ టెక్నాలజీ న్యూస్ లెటర్‌తో మాట్లాడుతూ కూరియన్, AI వల్ల ఉద్యోగాలు పూర్తిగా కోల్పోతాం అని భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. AIను సరైన విధంగా ఉపయోగిస్తే, ఇది ఉద్యోగులను రద్దు చేయడం కాకుండా వారి సామర్థ్యాన్ని పెంచుతుంది. గూగుల్ గత ఏడాది ప్రారంభించిన కస్టమర్ ఎంగేజ్‌మెంట్ సూట్ వంటి AI ఆధారిత కస్టమర్ సర్వీస్ టూల్స్ ప్రొడక్టివిటీ పెంచుతున్నప్పటికీ, ఉద్యోగాలపై ప్రభావం లేదు. ప్రారంభంలో కొన్ని క్లయింట్స్ భయపడినప్పటికీ, "మా క్లయింట్స్ లో ఎవరు ఉద్యోగులను తొలగించలేదు," అని ఆయన చెప్పారు.
గూగుల్ లేదా విదేశీ కంపెనీలు మాత్రమే కాదు, భారతదేశంలోని ఐటీ రంగం పైనా (టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి పెద్ద సంస్థలు) AI ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఈ కంపెనీలు తమ రోజువారీ పనుల్లో కోడింగ్, టెస్టింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో AI టూల్స్‌ని వేగంగా ఉపయోగించడం ప్రారంభించాయి. దీని వలన, గతంలో మానవ శ్రమతో జరిగే సులభమైన పనులను ఇప్పుడు AI సిస్టమ్స్ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా జూనియర్ లెవల్ ఉద్యోగాలు ఉదాహరణకు టెస్టింగ్ ఇంజినీర్లు, సపోర్ట్ సిబ్బంది, డేటా ఎంట్రీ రోల్స్ భవిష్యత్తులో మార్పులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది ఉద్యోగాల సంఖ్యను తగ్గించకపోయినా, అవసరమయ్యే స్కిల్స్ మరియు పని విధానం పూర్తిగా మారిపోవచ్చు. అందుకే భారత ఐటీ రంగం కూడా AIకి అనుగుణంగా ఉద్యోగులను కొత్త టెక్నాలజీలలో ట్రైన్ చేయడం, స్కిల్స్ అప్‌డేట్ చేయడం మీద దృష్టి పెడుతోంది.
AI టూల్స్ వాడుతున్న కంపెనీలు ఇప్పుడు చిన్న చిన్న కస్టమర్ ప్రశ్నలను మనుషులు కాకుండా AI ద్వారా త్వరగా పరిష్కరిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఇక చిన్న పనుల మీద టైమ్ ఖర్చు చేయకుండా, పెద్ద సమస్యల మీద ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతున్నారు. "AI ఉద్యోగాలను తగ్గించడం కాదు, వాళ్ల పనిసామర్థ్యాన్ని పెంచుతోంది," అని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications