AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026.. ప్రపంచ దేశాలకు దిక్చూచిలా మారనున్న భారత్.. హైలెట్స్ ఇవిగో..

న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నేడు ఘనంగా ప్రారంభం కానుంది. ప్రపంచ కృత్రిమ మేధస్సు రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులు, వాటి ప్రభావాలు, అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు ఐదు రోజుల పాటు ఈ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఉద్యోగాల అంతరాయం నుంచి పిల్లల భద్రత వరకు అనేక కీలక అంశాలు ఈ సమ్మిట్ అజెండాలో ఉన్నాయి. ఈ అంతర్జాతీయ AI ఇంపాక్ట్ సమ్మిట్‌ను నరేంద్ర మోదీ ప్రారంభించనుండగా.. ప్రపంచ AI పాలన, సహకారం కోసం భాగస్వామ్య రోడ్‌మ్యాప్"ను ప్రకటించడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.

ఈ ఎక్స్‌పోలో ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థలు, స్టార్టప్‌లు, విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ భాగస్వాములు ఒకే వేదికపైకి రానున్నారు. AI రంగంలో తాజా ఆవిష్కరణలు, విధానాలు, పెట్టుబడులపై చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 13 దేశాలకు చెందిన పెవిలియన్‌లు ఏర్పాటు చేయగా.. ఇవి అంతర్జాతీయ సహకారాన్ని ప్రతిబింబించనున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఎస్టోనియా, తజికిస్తాన్‌తో పాటు ఆఫ్రికా దేశాల పెవిలియన్‌లు ఈ ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

AI Impact Summit 2026 AI impact summit agenda AI job disruption AI and employment impact artificial intelligence job loss AI future of work AI reskilling workforce AI child safety child protection and AI AI ethics summit responsible AI AI regulation and policy AI social impact AI risks and challenges AI governance global AI summit technology and society AI digital safety AI online child protection 2026 - amp amp 2026 2026 AI summit 2026 AI jobs news AI child safety news AI ethics debate future of work AI artificial intelligence risks AI policy discussions

ఈ శిఖరాగ్ర సమావేశానికి 30కి పైగా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారని అంచనా. మొత్తం 2.5 లక్షలకు పైగా సందర్శకులు వస్తారని అధికారులు తెలిపారు. AI పరిశ్రమలో భారత్ కీలక హబ్‌గా మారుతున్న నేపథ్యంలో.. ప్రపంచ AI దిగ్గజాల అగ్రశ్రేణి కార్యనిర్వాహకులు కూడా ఈ వారం న్యూఢిల్లీలో సమావేశమవుతున్నారు. ఇప్పటికే Alphabetకు చెందిన గూగుల్, Microsoft, Amazon సంస్థలు 2030 వరకు AI, క్లౌడ్ మౌలిక సదుపాయాల్లో కలిపి దాదాపు 68 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడంతో.. భారత్ AI సంస్థలకు ఆకర్షణీయ కేంద్రంగా మారుతోంది.

ప్రపంచ AI పాలనలో అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతులను బలంగా వినిపించేందుకు ఈ ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని భారత అధికారులు భావిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఈ స్థాయి గ్లోబల్ AI సమ్మిట్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సమ్మిట్‌లో ముఖ్య వక్తలుగా సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మాన్, డారియో అమోడీ, ముఖేష్ అంబానీ,డెమిస్ హస్సాబిస్ ప్రసంగించనున్నారు.

ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరిగే ఈ అంతర్జాతీయ AI సమ్మిట్ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను హై అలర్ట్ చేశారు. భారత్ మండపం పరిసర ప్రాంతాల్లో 10 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. QR కోడ్ ఆధారిత పాస్‌లతోనే ప్రవేశం కల్పించనున్నారు. నగరంలోని మధుర రోడ్డు, జనపథ్, అక్బర్ రోడ్డు, శాంతి పథ్ వంటి కీలక మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నారు.

ఇదే సమయంలో ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమయ్యే CBSE బోర్డు పరీక్షలు 2026 నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఢిల్లీ మెట్రో సేవలు యధావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఏదేమైనా ఇండియా AI Impact Summit 2026 భారత్‌ను గ్లోబల్ AI నాయకత్వ దిశగా మరింత ముందుకు నడిపించే కీలక వేదికగా మారనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+