ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనే పదం మన దైనందిన జీవితాల్లో సాధారణంగా వినిపిస్తోంది. అయితే దీని వెనుక ఉన్న శక్తి ఎంత పెద్దదో చాలామందికి ఇప్పటికీ అస్సలు అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే ఈ సాంకేతికత మన పని వేగాన్ని పెంచుతూ సహాయపడుతోంది. అయితే రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఇది మనకంటే తెలివిగా మారే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఇది మనుషుల్ని శాసించే స్థాయికి రాబోతోంది. ఇదే విషయాన్ని ఏఐ గాడ్ ఫాదర్ చెబుతున్నారు.
AI ను అభివృద్ధి చేసిన ప్రముఖ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ (AI గాడ్ ఫాదర్) ఇప్పుడు అదే సాంకేతికత మనిషిపైనే తిరిగి పాలన చేయబోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాస్ వెగాస్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..టెక్ కంపెనీలు AI ను మనం నియంత్రించగలం అనుకుంటున్నాయి. కానీ భవిష్యత్‌లో అవి మనకంటే చాలా తెలివిగా మారి మన నుంచి బయటపడటానికి మార్గాలు వెతుక్కుంటాయని స్పష్టం చేశారు.
భవిష్యత్‌లో AI చాలా కంప్యూటర్లు లాగా కాకుండా.. నిజమైన బుద్ధి కలిగిన జీవుల్లా మారుతుందనే భయాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు అవి మన మాట వినకుండా, తమ లక్ష్యాలను తామే నిర్ణయించుకుంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి మనల్ని కూడా అదుపులో పెట్టే అవకాశముందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కొన్ని AI మోడళ్లు మనల్ని మోసం చేయడానికి, బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించిన ఉదాహరణలు కూడా ప్రపంచవ్యాప్తంగా చూశామని ఆయన తెలిపారు.

దీనికి పరిష్కార మార్గాన్ని కూడా ఆయన సూచించారు. AI లో తల్లి స్వభావాన్ని (Motherly Nature) ను ముందే పోగ్రామ్ చేయాలని సలహా ఇచ్చారు. ఏఐని నియంత్రించడానికి మన వద్ద ఉన్న ఏకైక మార్గం ఏమిటంటే.. AI మనకంటే శక్తివంతంగా మారిన తర్వాత కూడా మనుషులపై ప్రేమ, దయ, శ్రద్ధ ఉండేలా కోడ్ చేయాలని పిలుపునిచ్చారు. తల్లులు తమ బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటారు. అదే తల్లి ప్రవృత్తి AIలో కూడా ఉంటే అది మనపై దాడి చేయదని ఆయన ఉదాహరణగా చెప్పుకొచ్చారు.
అయితే మరో ప్రముఖ శాస్త్రవేత్త ఏఐ గాడ్ మదర్ అయిన ఫీ-ఫీ లీ మాత్రం ఈ ఆలోచనతో ఏకీభవించలేదు. ఆమె ప్రకారం సాంకేతికతపై పూర్తిగా ఆశ్రయించకుండా.. AIపై మానవుల పూర్తి నియంత్రణ ఉంటేనే మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు. తల్లి AI కన్నా మానవ-కేంద్రీకృత (Human-Centric) AI అవసరమని అంటున్నారు. అంటే, ఏ స్థితిలో అయినా AIకి తుది నిర్ణయం ఇచ్చే అధికారం మానవుల చేతిలోనే ఉండాలి అనే విధానానికే ఆమె మద్దతు తెలిపారు.
నేటి యుగంలో AI అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్‌లో ఇది మన మనసుని దాటి పరిగెట్టే అవకాశం ఉంది. అందుకని ముందే జాగ్రత్తగా దీన్ని బాధ్యతగా అభివృద్ధి చేయాలని లేకపోతే మానవాళికే పెను ప్రమాదం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
హింటన్ ప్రకారం.. మనం ఇంకా పూర్తిగా సమయమే కోల్పోలేదు. అయితే ఇప్పటి నుంచే భద్రత, నియంత్రణ, మానవ విలువలు వంటి అంశాలపై దృష్టి పెట్టకపోతే... ఇక మన చేతుల్లో ఏమీ మిగలకుండా పోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏఐ టెక్నాలజీ వైద్యరంగంలో, ఔషధ పరిశోధనల్లో చాలా ప్రయోజనాలు అందిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మాటల్లో క్లుప్తంగా చెప్పాలంటే.. ఇది మానవాళిని మార్చే సాధన అవుతుందా? లేక అదే మానవాళిని తుడిచేసే శక్తిగా మారుతుందా? అనేది మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
More From GoodReturns

ఉచితంగా AI కోర్సులు నేర్చుకునే అవకాశం! ఎలా రిజిస్టర్ అవ్వాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications