IT News: ఐటీ ఉద్యోగాలను 92 శాతం మార్చనున్న ఏఐ.. TCS కీలక పరిణామం..
AI Impact on AI: సమాజంలో ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ సాంకేతికత పెను మార్పులకు దారితీయనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఉద్యోగులను ఏఐ సాంకేతికత రీప్లేస్ చేయగలదా అన్నదే ప్రస్తుతం కొనసాగుతున్న చర్చ, ఆందోళన.
ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితం అవుతారని సంచలన రిపోర్ట్ బయటకొచ్చింది. AIలో పురోగతి కారణంగా 92% ఐటీ ఉద్యోగాలు భారీగా లేదా స్వల్పంగా పరివర్తనను చూస్తాయని AI-Enabled ICT Workforce నివేదిక వెల్లడించింది. ప్రధానంగా మధ్య స్థాయి కేటగిరీకి చెందిన 40 శాతం మంది ఉద్యోగులు దీనివల్ల ప్రభావితం అవుతారని వెల్లడించింది. అలాగే ఎంట్రీ లెవెల్ ఐటీ ఉద్యోగులు 37 శాతం మేర ట్రాన్స్ఫర్మేషన్‌కి గురవుతారని వెల్లడైంది.

కొత్త యుగంలో ఏఐ ఎథిక్స్, ఏఐ రెస్పాన్సిబిలిటీ, ర్యాపిడ్ ఇంజనీరింగ్, AI లిటరసీ, లార్జ్ ల్యాగ్వేజ్ మోడల్స్(LLM) నిర్మాణం వంటి సాంకేతికతలకు ప్రాముఖ్యత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చాలా కాలంగా కొనసాగుతున్న సాంప్రదాయ ఉద్యోగాలైన డేటా మేనేజ్మెమెంట్, కంటెంట్ క్రియేషన్, డాక్యుమెంటేషన్ నిర్వహణ, బేసిక్ ప్రోగ్రామింగ్ వంటి వాటికి భవిష్యత్తులో ప్రాముఖ్యత తగ్గిపోతుందని వారు చెబుతున్నారు. రానున్న రోజుల్లో క్లిటికల్ స్కిల్స్ చాలా ముఖ్యంగా మారతాయని అభిప్రాయపడుతున్నారు.
మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగాలను కొనసాగించటానికి ఉద్యోగులు తమను తాము అప్ స్కిల్ చేసుకోవాల్సిన పరిస్థితి చాలా ముఖ్యమని వారు చెబుతున్నారు. Cisco, Accenture, Eightfold, Google, IBM, Indeed, Intel, Microsoft, SAP వంటి టెక్ దిగ్గజాలు ఇప్పటికే తమ రోజువారీ పనిలో ఏఐని ఎంత సమర్థవంతంగా వినియోగించవచ్చనే దానిపై దృష్టిని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో మెటా సీఈవో జుకర్ బర్గ్ కూడా రానున్న కాలంలో ఉద్యోగుల స్థానంలో ఏఐ వినియోగం వల్ల మధ్య స్థాయి టెక్కీలు ప్రభావితం అవుతారని పేర్కొన్న సంగతి తెలిసిందే.
టీసీఎస్ నుంచి ప్రకటన ఇదే..
రానున్న కాలంలో ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న వేళ టెక్ పరిశ్రమలో మధ్యస్థాయి ఉద్యోగులు ప్రభావితం అవుతారని పేర్కొంది. అయితే ఇది తాత్కాలిక ప్రభావాన్ని కలిగించటంతో పాటు పరివర్తనకు దారితీస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications