IT News: పరిశోధకులకే షాకిచ్చిన AI చాట్ బాట్.. టెక్కీలు ఇక సర్దుకోక తప్పదేమో!
IT News: క్లయింట్ల అవసరాలకు తగినట్లు టెక్ కంపెనీలు సాఫ్ట్‌వేర్లు రూపొందిస్తుంటాయి. ఇందుకోసం పెద్దమొత్తంలో పెట్టుబడితో పాటు మానవ వనరుల అవసరం ఉంటుంది. ఆర్థిక అనిశ్చితి దృష్ట్యా, ప్రస్తుతం దిగ్గజ సంస్థలు కూడా ఖర్చులు తగ్గించుకోవడం కోసం చూస్తున్నాయి. ఈ సమయంలో ChatGPT వంటి AI చాట్ బాట్ లు వారికి వరంలా దొరికాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని మార్కెట్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే మరికొందరు వాటిని కొట్టిపారేస్తున్నారు. ఇది చూసిన తరువాత వారు అభిప్రాయం మార్చుకోవాల్సి వస్తుందేమో..! ఎందుకంటే ఒక అమెరికన్ డాలర్ కంటే తక్కువ ఖర్చుతో, కేవలం 7 నిమిషాల్లోనే ఓ గేమ్ రూపొందిచడం కోసం మొత్తం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రక్రియను పూర్తిచేసిందో AI చాట్ బాట్.

చైనాకు చెందిన బ్రౌన్ విశ్వవిద్యాలయం ఈ పరిశోధన నిర్వహించింది. తక్కువ ఖర్చుతో సాఫ్ట్‌వేర్ డెవలప్ మెంట్ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడానికి పలు యూనివర్సిటీలతో కలిసి ఈ ప్రయోగం జరిపింది. ఇందులో అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ మోడల్స్ తో కూడిన చాట్ బాట్‌లు.. తక్కువ మానవప్రమేయంతో మొత్తం సాఫ్ట్‌వేర్ కంపెనీని పర్యవేక్షించడంలో అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయి.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీని అనుకరించేందుకు 'చాట్ డెవ్' పేరిట పరిచయం చేసిన ఈ చాట్ బాట్.. ChatGPTకి చెందిన 3.5 మోడల్‌తో రూపొందించబడింది. డెవలప్‌మెంట్ సైకిల్ లోని డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్, డాక్యుమెంటింగ్ దశలకు సంబంధించి ప్రతి AI బాట్ కు ఒక్కో నిర్ధిష్ట విభాగం కేటాయించబడింది.
"ఫైవ్ ఇన్ ఎ రో"గా పిలవబడే "గోమోకు గేమ్" రూపొందించడాన్ని చాట్ డెవ్ కు టాస్క్ గా ఇచ్చారు. ఇందుకోసం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఉపయోగించారు. మొత్తం 70 టాస్క్‌లను చాట్ డెవ్ విజజయవంతంగా పూర్తిచేసి అత్యుత్తమ ఫలితాలు ఇచ్చినట్లు పరిశోధనా పత్రం తెలిపింది. 86.66 శాతం ఖచ్చితత్వంతో ఈ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ పనిచేసినట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications