టెక్ మాత్రమే కాదు, నాన్‌-టెక్ విద్యార్థులకూ AI లో కొత్త అవకాశాలు ఇస్తామంటున్న కాగ్నిజెంట్‌

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) వర్క్‌ప్లేస్‌ను మార్చేస్తున్న ఈ కాలంలో, ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ (Cognizant) కొత్త నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఇప్పుడు ఎంట్రీ లెవల్‌ నియామకాలను పెంచాలని నిర్ణయించింది. అంతేకాదు, ఈసారి కేవలం ఇంజినీరింగ్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకే కాకుండా ఇతర రంగాల విద్యార్థులకూ తలుపులు తెరిచింది.

కంపెనీ సీఈఓ ఎస్. రవి కుమార్ ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ, "AI ఉద్యోగాలను తగ్గించదు, అసలు అది ఇంకా పెంచుతుంది" అని చెప్పారు. ఆయన మాటల్లో AI అనేది మనుషుల సామర్థ్యాన్ని పెంచే సాధనం. ఇది ఉద్యోగాలను తీసేసే వ్యూహం కాదు.

AI Career Opportunities Now Open for Non-Tech Students Too

కాగ్నిజెంట్‌ ఇప్పుడు ఆంథ్రపాలజీ, సొషాలజీ, సైకాలజీ, జర్నలిజం వంటి నాన్‌-టెక్‌ కోర్సులు చదివిన విద్యార్థులను కూడా ఉద్యోగాలకు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ రవి కుమార్‌ మాట్లాడుతూ, "ఇప్పుడే ఇంటర్నెట్‌ ద్వారా ఏ సమాచారం అయినా సులభంగా దొరుకుతుంది. అప్పుడు ప్రత్యేకమైన జ్ఞానం లేదా నైపుణ్యం ఎందుకు అంత విలువగా ఉండాలి?" అని ప్రశ్నించారు. ఆయన చెప్పినదేమిటంటే ఇప్పటి ప్రపంచంలో తేడా జ్ఞానంలో లేదా తెలివిలో కాదు, మన దగ్గర ఉన్న తెలివిని ఎలా ఉపయోగిస్తామన్నదే నిజమైన తేడా అని అన్నారు.

రవి కుమార్‌ విద్యార్థులకు ఒక సింపుల్‌ సలహా ఇచ్చారు. ఈ కాలంలో ఒకే రంగంలో జ్ఞానం ఉండటం సరిపోదు. వివిధ రంగాల నైపుణ్యాలను కలిపి నేర్చుకోవడం చాలా అవసరం. ఉదాహరణకు, చరిత్ర చదివిన విద్యార్థులు కేవలం గతాన్ని తెలుసుకోవడంలోనే కాదు, కంప్యూటర్‌ లేదా డేటా అనలిసిస్‌ స్కిల్స్‌ నేర్చుకుంటే, భవిష్యత్తు ట్రెండ్స్‌ అంచనా వేసే "ఫ్యూచరిస్ట్‌లు"గా మారవచ్చు. అలాగే, బయాలజీ చదివిన విద్యార్థులు AI టెక్నాలజీని ఉపయోగించడం నేర్చుకుంటే, కొత్త మందుల తయారీ లేదా పరిశోధన ప్రక్రియను వేగంగా పూర్తి చేయగలరు. అంటే, ఒక రంగంలోని జ్ఞానాన్ని మరొక రంగంలోని టెక్నాలజీతో కలపడం ద్వారా కొత్త అవకాశాలు, క్రియేటివ్‌ కెరీర్‌ మార్గాలు తెరుచుకుంటాయి అని ఆయన చెప్పారని అర్థం.

రవి కుమార్‌ టెక్నాలజీ వల్ల వచ్చిన డిజిటల్‌ అసమానత గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ అభివృద్ధి మన జీవితాలను సులభం చేసింది, కానీ అందరికీ సమానంగా లాభం చేకూరలేదని. ఉదాహరణకు, ఈ టూల్స్‌ను (అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్‌లు, AI సిస్టమ్స్‌) రూపొందించిన వాళ్లు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించారు, వారి కంపెనీలు బిలియన్లగా మారాయి. కానీ, ఆ టెక్నాలజీని వాడుతున్న సాధారణ ప్రజలకు మాత్రం సౌకర్యం, సమాచారం లాంటి ప్రయోజనాలు మాత్రమే దక్కాయి. అంటే, టెక్నాలజీ సృష్టించినవారికి సంపద వచ్చింది, కానీ వాడినవారికి కేవలం సౌకర్యం మాత్రమే లభించింది. ఈ పరిస్థితి సమాజంలో "డిజిటల్‌ అసమానత" అనే కొత్త తేడాను తెచ్చిందని ఆయన చెప్పారు.

రవి కుమార్‌ ముఖ్యంగా చెప్పిన విషయం ఏమిటంటే, చివరికి మానవ నైపుణ్యాలు చాలా ముఖ్యమని. AI ఎంత వేగంగా ఎదిగినా, మనుషుల సహకారం లేకుండా పూర్తి పని చేయలేమని ఆయన స్పష్టం చేశారు. AI ప్రారంభ దశలో మనం ఇచ్చిన ప్రాంప్ట్స్‌, ఆలోచనలు, సమస్యలను గుర్తించడం వంటి పనులు చేయగలదు. మధ్య దశలో, ఆ పని AI సహాయంతో వేగంగా, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ చివర్లో, ఫలితాలను తనిఖీ చేయడం, నిర్ధారించడం (validation & verification) అనే బాధ్యత పూర్తిగా మనుషుల చేతిలోనే ఉంటుంది. అంటే, AI టూల్స్ మనం చేసే పనిను సులభతరం చేస్తాయి, కానీ తుది నిర్ణయాలు, ఫలితాల నిశ్శద్దతను ఖచ్చితంగా చేయడం మనుషులే చేయాలి, అని ఆయన వివరించారు.

ప్రస్తుతం కాగ్నిజెంట్‌ 30 రాష్ట్రాల్లో అప్రెంటీస్‌షిప్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తోంది. అలాగే Merit America అనే సంస్థతో కలిసి మధ్యస్థ వయసు ప్రొఫెషనల్స్‌ కు కూడా కొత్త అవకాశాలు కల్పిస్తోంది. మొత్తానికి, కాగ్నిజెంట్‌ ఈసారి టెక్‌ విద్యార్థులకే పరిమితం కాకుండా, విభిన్న రంగాల వారికీ అవకాశాలు ఇస్తూ AI ఆధారిత భవిష్యత్తులో కొత్త మార్గాలు తెరవబోతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+