AI: గర్ల్ ఫ్రెండ్ లేరని భాధపడుతున్నారా..? ఇదిగో పరిష్కారం!
AI: పెరుగుతున్న టెక్నాలజీ వినియోగాన్ని చూసి భయపడాలో, కొత్తగా అందివస్తున్న అవకాశాలను చూసి ఆనందించాలో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో జాబ్స్ ఊడతాయని ఆందోళన చెందాలో, నూతన అనుభూతులను పరిచయం చేయడానికి AI సిద్ధమవుతోందని తెలిసి ఆనందపడాలో అర్థం కావడం లేదు.
వయసు మీద పడుతున్నా పెళ్లికాని ప్రసాదులకు, గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడే యూత్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఓ సొల్యూషన్ చూపించనుంది. AI సహాయంతో నచ్చిన విధంగా భాగస్వామిని రూపొందించుకునే అవకాశం ఎంతో దూరంలో లేదు. సిలికాన్ వ్యాలీకి చెందిన ఆండ్రీసెన్ హోరోవిట్జ్ కంపెనీ ప్రాజెక్టు ఈ ఫాంటసీని నిజం చేయనుంది.

AI టెక్నాలజీని ఉపయోగించి గర్ల్ లేదా బాయ్ ఫ్రెండ్ ని ఎలా రూపొందించుకోవాలో వివరించే ఓ గైడ్ ను ఆ కంపెనీ 'గిట్ హబ్'లో షేర్ చేసింది. నచ్చిన వ్యక్తిత్వం, నేపథ్యాన్ని ఎంటర్ చేసి కావాల్సిన విధంగా స్నేహితులను క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ కోసం అందుబాటులో ఉంది. అయితే దీని ద్వారా రొమాంటిక్ చాట్ చేసే బోట్స్ క్రియేట్ చేసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నట్లు తేలింది.
శృంగార కోరికలు తీర్చుకోవడం కోసం AI భాగస్వాములను ఓ కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టింది. అయితే ఇందు కోసం పెద్ద మొత్తంలో వెచ్చించాల్సి రావడంతో అదికాస్తా వెనక్కు తగ్గింది. ఏది ఏమైనా టెక్నాలజీ ద్వారా డిజైన్ చేసుకునే మెషీన్లకు మానవ ప్రతి స్పందనలు ఉండవని గుర్తించాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications