ఏఐ సాయంతో బిడ్డను కన్న దంపతులు, అమ్మ ప్రాణాలు కాపాడిన చాట్‌జిపిటి.. టెక్నాలజీ అంటే ఇదే మరి..

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏఐ రాకతో గ్లోబల్ స్వరూపమే మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకీ ప్రతీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ఏఐ మీద ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఆందోళనలు ఉన్నా..ఎక్కువ శాతం చాలా సహాయకారిగా ఉంటుంది. ఏఐ వల్ల మానవ మేథస్సుకు పని తగ్గుతుందని అది మనుషులు చేసే పనిని కూడా చేస్తూ వారి ఉద్యోగాలకు ఎసరు పెడుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.

తాజాగా ఏఐ మరో అద్భుతాన్ని సృష్టించింది. ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పులకు వేదికగా నిలిచింది. అమెరికాలోని ఓ జంటకు బిడ్డను అందించి మరో సంచలనానికి కేరాఫ్ అడ్రస్ అయింది. వార్తలోకి వెళితే.. 19 సంవత్సరాలుగా సంతానానికి ప్రయత్నిస్తున్న ఓ జంట AI ఆధారిత టెక్నాలజీతో బిడ్డను కన్నారు. ఆరోగ్యం రంగంలోని ఇది ఓ మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఈ జంట 19 ఏళ్ళ నుంచి అజోస్పెర్మియా అనే తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ప్రకారం.. వీర్యంలో స్పెర్మ్ కనిపించదు. ఇప్పటికే వారు 15 IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా బిడ్డను కనాలని ప్రయత్నించి అలసిపోయారు.

ఈ పరిస్థితుల్లో కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్ అభివృద్ధి చేసిన ప్రత్యేక AI వ్యవస్థ అయిన STAR (Sperm Track And Recovery) వారికి బిడ్డ మీద ఆశను చిగురింపజేసింది. ఈ STAR వ్యవస్థ ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాలను గుర్తించడానికి ఉపయోగిస్తుంటారు. అచ్చం అలాగే ఇది మానవ శరీరంలోని ప్రైవేట్ పార్టులో ఉండే చాలా అరుదైన స్పెర్మ్‌ను గుర్తించగలదు. ఈ అల్గోరిథం ఆధారిత వ్యవస్థ స్పెర్మ్ నమూనాను చిన్న గొట్టాల ద్వారా ప్రసారం చేస్తుంది. అక్కడ స్పెర్మ్ కనిపించిన వెంటనే.. AI టెక్నాలజీ దానిని గుర్తించి వెంటనే వేరు చేస్తుంది. అంతే కాకుండా స్పెర్మ్‌ను నిల్వ చేసేందుకు లేదా గర్భధారణ కోసం వెంటనే ఆ వీర్య కణాలను ఉపయోగించగలుగుతుంది.

AI baby success story couple conceives after 19 years AI in fertility treatment artificial intelligence IVF infertility breakthrough AI helps couple have baby miracle baby story emotional parenting story AI pregnancy success 19 years no child AI assisted conception AI fertility hope IVF success with AI infertility AI technology AI 19 AI AI IVF AI AI 19 AI AI

19 ఏళ్లుగా బిడ్డ కోసం తపిస్తున్న ఈ జంట కోసం కూడా కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్లు అదే ప్రక్రియను ఉపయోగించారు. భర్త వీర్య నమూనా తీసిన రెండు గంటలకే.. AI వ్యవస్థ కొన్ని స్పెర్మ్‌లను దానిలో గుర్తించి వేరు చేసింది. వెంటనే ఆ కణాలను భార్య అండంలో ఉండే గుడ్డులతో ఫలదీకరణ చేశారు. కొద్దిరోజుల్లో దాన్ని భార్య గర్భాశయంలోకి బదిలీ చేశారు.ఈప్రాసెస్ పూర్తిగా విజయవంతం అయింది. ఇప్పుడు ఆమె నాలుగు నెలల గర్భవతి. తల్లి, ఆమె కడుపుతో ఉన్న పిండం ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.

ఈ STAR వ్యవస్థ డాక్టర్ల ప్రయత్నంతో సాధ్యం కాని పరిస్థితుల్లో కూడా స్పెర్మ్‌ను గుర్తించగలదు. పిండ శాస్త్రవేత్తలు రెండు రోజులు కష్టపడినా కూడా ఏ స్పెర్మ్‌ను కనుగొనలేకపోయారు. అయితే అదే నమూనాలో STAR కేవలం ఒక గంటలోనే 44 స్పెర్మ్‌లను గుర్తించింది. ఇది AI వ్యవస్థలో వచ్చిన పెనుమార్పుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

అజోస్పెర్మియాతో ప్రపంచంలో 1 శాతం మంది పురుషులు ప్రభావితం అవుతున్నారు. ఇది పురుషుల వంధ్యత్వ సమస్యల్లో 10 శాతం కారణంగా చెప్పబడుతుంది. ఈ సమస్యకు ప్రస్తుతం AI ఆధారిత STAR వ్యవస్థ ఒక మేలైన పరిష్కారంగా కనిపిస్తోంది. ఇంతకాలం బిడ్డ కలగదనే నిరాశలో ఉన్నవారికి, ఇప్పుడు ఆరోగ్యకరమైన బిడ్డ కలిగే అవకాశాన్ని ఈ టెక్నాలజీ అందిస్తోందని STAR వ్యవస్థ డెవలపర్ డాక్టర్ జెవ్ విలియమ్స్ తెలిపారు.

మరో ఘటనలో చాట్‌జిపిటి నా అమ్మను కాపాడిందని ఓ యువతి చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. మేము బెస్ట్ డాక్టర్లను కలిసాము.. పెద్ద హాస్పిటళ్లు తిరిగాం.. హోమియోపతి, ఆయుర్వేదం, ఆలోపతి అన్నీ ట్రై చేసినా ఏదీ పనిచేయలేదు. ఇప్పుడు మా అమ్మ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.లోపల రక్తస్రావం అవుతోంది. ఇది ఇంకా ఆరు నెలలు ఇలానే కొనసాగితే బతకడం కష్టమని వైద్యులు తెలిపారు. భయంతో వణికిపోయాను. చివరకు మా అమ్మ పరిస్థితిని పూర్తిగా చాట్‌జిపిటికి వివరించానని ఆ యువతి తెలిపింది.

చాట్‌జిపిటి దీనికి అనేక కారణాలను చెప్పింది. వాటిలో BP మందులు కూడా కారణం కావచ్చని సూచించింది.ఇది మేము ఊహించలేకపోయాం. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పాం.. ఆయన వెంటనే మందును మార్చారు. ఇప్పుడు మా అమ్మ మెల్లగా కోలుకుంటున్నారని తెలిపింది. ఈ అద్భుతమైన టెక్నాలజీని రూపొందించినందుకు సామ్ ఆల్ట్‌మన్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆ మహిళ పోస్ట్ చేసింది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుందనడానికి ఇంతకన్నా నిదర్శనాలు ఏమి కావాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+