For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

AI అడాప్షన్‌తో 2025 నాటికి భారత జీడీపీకి అదనంగా 500 బిలియన్ డాలర్లు

|

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అడాప్షన్, డేటా యుటిలైజేషన్ స్ట్రాటెజీ వంటి అంశాలు భారత్‌కు అదనపు ప్రయోజనమని, ఇది 2025 నాటికి భారత జీడీపీకి అదనంగా 500 బిలియన్ డాలర్లను సమకూర్చవచ్చునని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్టువేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(NASSCOM) నివేదిక పేర్కొంది. ఈ ఐటీ ఇండస్ట్రీ బాడీ తాజాగా ఏఐ అడాప్షన్ ఇండెక్స్ (ఫర్ ఇండియా)ను లాంచ్ చేసింది. ఇది బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్స్యూమర్ ప్రోడక్ట్స్, రిటైల్, హెల్త్ కేర్, ఇండస్ట్రియల్ అండ్ ఆటోమేటివ్ అనే నాలుగు కీలక రంగాల్లో ఏఐ అడాప్షన్ పోకడలను అంచనా వేసింది.

ఈ రంగాలు 2025 నాటికి దేశ జీడీపీకి ఏఐ జోడింపు 60 శాతం ఉండవచ్చునని, ఇది 450 బిలియన్ డాలర్ల నుండి 500 బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. కరోనా మహమ్మారి టెక్నాలజీలో మరింత మార్పుకు కారణమైంది. ఈ మహమ్మారి పలు రంగాల్లో డేటా అండ్ టెక్నాలజీ సిలోస్ నుండి ఏఐ టెక్నాలజీ స్వీకరణ వరకు కారణమైంది. ఏఐ అడాప్షన్ వేగంగా పెరిగి, 2025 నాటికి మంచి వృద్ధిని నమోదు చేస్తుందని చెబుతున్నారు.

AI adoption to add $500 billion to Indias GDP by 2025

భారత హెల్త్ కేర్ మార్కెట్ 2016లో 372 బిలియన్ డాలర్లు కాగా, 2022 ాటికి మూడింతలు పెరిగి 110 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే హెల్త్ కేర్ రంగంలో ఏఐ అడాప్షన్‌తో 2025 నాటికి ఈ రంగం నుండి 25 బిలియన్ డాలర్లు జనరేట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. నాస్‌కాం నివేదిక ప్రకారం గత రెండేళ్లలో అంతర్జాతీయంగా ఏఐ పెట్టుబడులు రెండింతలు అయ్యాయి. 2020లో 36 బిలియన్ డాలర్లు కాగా, 2021లో 77 బిలియన్ డాలర్లలకు చేరుకుంది.

English summary

AI అడాప్షన్‌తో 2025 నాటికి భారత జీడీపీకి అదనంగా 500 బిలియన్ డాలర్లు | AI adoption to add $500 billion to India's GDP by 2025

An integrated adoption of AI and data utilisation strategy can add $500 billion to India’s GDP by 2025, suggests a report by the NASSCOM.
Story first published: Friday, June 24, 2022, 9:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X