UPI Payments: అక్టోబర్ 10 నుంచి యూపీఐ పేమెంట్స్ బంద్.. న్యూకాన్స్ సంచలన నిర్ణయం..!
అక్టోబర్ 15 నుంచి వ్యాపారులకు చేసే రూ.2000 కంటే ఎక్కువ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు విధించనున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ యూపీఐ లావాదేవీలు తగ్గాయి. అంతకాకుండా చాలా మంది వ్యాపారులు యూపీఐ పేమెంట్లు తీసుకోవడం తక్కువ చేయాలని భావిస్తున్నారు. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన పారిశ్రామిక మార్కెట్‌ప్లేస్ 'న్యూకాన్స్' అక్టోబర్ 10 నుండి UPI చెల్లింపులను స్వీకరించడాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. నిర్దిష్ట ఆన్‌లైన్ లావాదేవీలపై విధించే 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR) తమ కంపెనీ లాభాల మార్జిన్‌లను గణనీయంగా తగ్గిస్తుందని న్యూకాన్స్ సహ-వ్యవస్థాపకుడు తెలిపారు.
సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత అక్టోబర్ 10 నుండి యూపీఐ సేవలను నిలిపివేయాలని తాము నిర్ణయించుకున్నామని న్యూకాన్స్ సహ-వ్యవస్థాపకుడు ప్రితేష్ లఖానీ 'X' (ట్విట్టర్) వేదికగా తెలిపారు.
అక్టోబర్ 15, 2026 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన ప్రతి 'పర్సన్-టు-మర్చంట్' (వ్యక్తి నుంచి వ్యాపారికి) యూపీఐ బదిలీపై 0.4% MDR ఛార్జీ వర్తిస్తుందని ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే 'పర్సన్-టు-పర్సన్' (వ్యక్తి నుంచి వ్యక్తికి) యూపీఐ బదిలీలు, చిన్న వ్యాపారులకు చేసే చెల్లింపులు మాత్రం ఉచితంగానే కొనసాగుతాయి.

పన్నుకు ముందు ఆర్డర్ విలువపై న్యూకాన్స్ 0.5% కమిషన్‌ను పొందుతుంది. ఉదాహరణకు రూ.10,000 విలువైన ఆర్డర్‌పై కంపెనీకి రూ.50 కమిషన్ లభిస్తుంది. అయితే అక్టోబర్ 15 నుంచి GSTతో సహా కస్టమర్ చెల్లించే మొత్తం మొత్తంపై 0.4 శాతం యూపీఐ ఎండీఆర్ వసూలు చేస్తారని లఖానీ తెలిపారు. 18 శాతం GSTతో కూడిన రూ.10,000 ఆర్డర్ విషయంలో, కస్టమర్ మొత్తం రూ.11,800 చెల్లిస్తారు. 0.4% MDR రేటు ప్రకారం రూ.11,800 పై యూపీఐ ఛార్జీ రూ.47.20 అవుతుంది. దీనివల్ల కంపెనీకి అసలు రూ.50 కమిషన్‌లో కేవలం రూ.2.80 మాత్రమే మిగులుతుంది. మరో మాటలో చెప్పాలంటే, రూ.2,000 కంటే ఎక్కువ విలువైన ప్రతి UPI ఆర్డర్‌పై విధించే ఈ మర్చంట్ ఛార్జీ, న్యూకాన్స్ మార్జిన్‌లో 94 శాతం వాటాను తగ్గిస్తుందని లఖానీ పేర్కొన్నారు.
రూ.47.20 ఎండీఆర్ పై 18 శాతం జీఎస్టీ విధిస్తారని, దీనివల్ల చెల్లింపు ఖర్చుకు మరో రూ.8.50 అదనంగా చేరుతుందని కూడా లఖానీ పేర్కొన్నారు. ఎండీఆర్ పై చెల్లించే రూ.8.50 జీఎస్టీని తిరిగి పొందే అవకాశం (క్లెయిమ్) ఉన్నప్పటికీ, దానిని ముందుగానే చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. కొత్త విధానం ప్రకారం రూ.2,000 కంటే ఎక్కువ విలువైన నిర్దిష్ట వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం MDR వర్తిస్తుంది. రూ.75,000, అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు, ఈ ఛార్జీ గరిష్టంగా లావాదేవీకి రూ.300గా పరిమితం చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
