కేంద్ర ప్రభుత్వం మౌలికసదుపాయాలపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా రవాణాకు సంబంధించి రోడ్లు, రైల్వేలపై ఖర్చు పెడుతోంది. దీంతో
రైల్వే సంబంధిత కంపెనీల స్టాక్స్ జోరుగా ట్రేడవుతున్నాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) షేర్లు భారీగా పెరిగాయి. 15 శాతం కంటే ఎక్కువగా పెరిగింది. ఐఆర్‌ఎఫ్‌సీ షేరు తొలిసారిగా రూ.200 పైన కొనసాగుతోంది. జూలై 23, 2024న సమర్పించే బడ్జెట్‌లో ప్రభుత్వం రైల్వేలకు భారీ నిధులు కేటాయించే అవకాశం ఉందని వార్తలు రావడంతో రైల్వే స్టాక్ ల్లో ర్యాలీ కనిపిస్తోంది.
మంగళవారం ట్రేడింగ్‌లో అన్ని ప్రభుత్వ పీఎస్‌యూ రైల్ స్టాక్స్ పెరుగుతున్నాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ స్టాక్ 16 శాతం కంటే ఎక్కువ జంప్‌తో రూ.568 జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఒక నెలలో 50 శాతం, ఆరు నెలల్లో 200 శాతానికి పైగా స్టాక్ పెరిగింది. 3 సంవత్సరాలలో స్టాక్ 16 రెట్లు పెరిగింది. IRFC స్టాక్‌లో కూడా బలమైన పెరుగుదల కనిపిస్తోంది. తొలిసారిగా ఐఆర్ ఎఫ్ సీ షేర్లు రూ.200 దాటి రూ.206కు చేరాయి.

ఈ షేరు 7 శాతం పెరుగుదలతో రూ.201 వద్ద ట్రేడవుతోంది. IRFC షేర్లు 2024 సంవత్సరంలో 101 శాతం రాబడిని ఇచ్చాయి. 2 సంవత్సరాలలో స్టాక్ 9 రెట్లు పెరిగింది. ఇర్కాన్ ఇంటర్నేషనల్ షేర్లు జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.334.50కి చేరాయి. ప్రస్తుతం షేరు 6.50 శాతం వృద్ధితో రూ.328 వద్ద కొనసాగుతోంది. బీఈఎంఎల్ 3.36 శాతం పెరిగి రూ.5236 వద్ద, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 3.28 శాతం వృద్ధితో కొనసాగుతోంది.
టెక్స్‌మాకో రైల్ షేర్ 4.50 శాతం పెరుగుదలతో రూ.285 వద్ద ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను జూలై 23న సమర్పించనున్నారు. ఈ సంవత్సరం 10000 కొత్త రైలు కోచ్‌లతో పాటు 2500 ప్యాసింజర్ కోచ్‌లను తీసుకురానున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications