DA Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంచిన కేంద్ర ప్రభుత్వం..!
దీపావళి పండుగకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం కరువు భత్యం (DA) పెంపునకు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు వర్తించే ఈ కరువు భత్యం (DA), కరువు ఉపశమన భత్యం (DR) పెంపు, జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. కరవు భత్యాన్ని మరో 3 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఆ ఉద్యోగుల డీఏ 60 నుంచి 63 శాతానికి డీఏ పెరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ విరమణ చేసి పింఛన్ పొందుతున్నవారికి ఇస్తున్న కరవు భృతి (డీఆర్) కూడా 3శాతం పెంచనుంది.
ఈ పెంపు వల్ల దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పింఛనుదారులు ప్రయోజనం పొందుతారు. ఈ DA-DR పెంపు కోసం ప్రభుత్వం రూ. 10,016 కోట్లను కేటాయించింది. ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (DA), పింఛనుదారులకు కరువు ఉపశమన భత్యాన్ని (DR) అదనపు విడతగా విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. ఇది అప్పటి వరకు ఉన్న మూల వేతనం/పింఛనులో 58 శాతం రేటుపై అదనంగా 2 శాతం పెంపును సూచించింది. కరువు భత్యం మరియు కరువు ఉపశమన భత్యం రెండింటి పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 6,791.24 కోట్ల భారం పడనుంది.

డీఏ పెంపుతో పాటు కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.10వేల కోట్లతో దేశీయంగా కంటైనర్ తయారీ ప్రోత్సాహక పథకానికి క్యాబినెట్ ఆమోదించింది. రూ.1856 కోట్లతో ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పథకం, రూ. 7395 కోట్లతో ప్రధాన మంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ పథకానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications