Amul: షాకిచ్చిన అమూల్, నందిని.. నెయ్యి, వెన్న ధరలు భారీగా పెంపు..!

ప్రముఖ డైరీ సంస్థ అమూల్ పండక్కి ముందే ప్రజలకు షాక్ ఇచ్చింది. అమూల్ తన నెయ్యి, వెన్న ఉత్పత్తుల రిటైల్ ధరలను దేశవ్యాప్తంగా పెంచింది. దీని ప్రకారం 1 కిలో నెయ్యి ప్యాకెట్ ధర రూ. 50, 500 గ్రాముల వెన్న ప్యాకెట్ ధర రూ. 15 పెరిగాయి. ఈ కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఉత్పత్తుల లేబుళ్లపై, అలాగే ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌డేట్ చేసినట్లు అమూల్ ప్రకటించింది. తాజా సవరణల తర్వాత, 1 కిలోల అమూల్ నెయ్యి ప్యాకెట్ ధర గతంలో ఉన్న రూ. 630 నుంచి రూ. 680కి పెరిగింది. అలాగే, 500 గ్రాముల స్వచ్ఛమైన నెయ్యి ప్యాకెట్ ధర రూ. 325 నుంచి రూ. 345కి (రూ. 20 పెంపు) చేరింది.

కంపెనీ తన వెన్న ప్యాకెట్ల ధరలను కూడా సవరించింది. గతంలో రూ. 63గా ఉన్న 100 గ్రాముల వెన్న ప్యాకెట్ ధర ఇప్పుడు రూ. 66కి పెరిగింది. అదేవిధంగా 500 గ్రాముల వెన్న ప్యాకెట్ ధర గతంలో రూ. 310 ఉండగా, ఇప్పుడు రూ. 325కి పెరిగింది. ఈ ధరల పెంపు వివిధ పరిమాణాల్లో నెయ్యి, వెన్న ఉత్పత్తులను కొనుగోలు చేసే వినియోగదారులపై ప్రభావం చూపనుంది. అంతకుముందు ఈ ఏడాది మే నెలలో అమూల్ తన తాజా పాల ప్యాకెట్ల ధరలను లీటరుకు రూ. 2 చొప్పున పెంచింది. మే 14 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పెంపు, గోల్డ్, తాజా, శక్తి, ఆవు పాలు వంటి ప్రధాన రకాల పాలపై వర్తించింది.

Amul

అప్పట్లో, అమూల్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను విక్రయించే 'గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్' (GCMMF), పశుగ్రాసం, ప్యాకేజింగ్ సామాగ్రి, ఇంధన ధరలు పెరగడం వల్ల పాల ధరలను సవరించాల్సి వచ్చిందని పేర్కొంది. అంతేకాకుండా పాల ఉత్పత్తిదారులకు (రైతులకు) చెల్లించే సేకరణ ధరలను పెంచడం కూడా ఈ ధరల పెంపునకు ఒక కారణమని ఫెడరేషన్ వివరించింది. మే నెలలో జరిగిన ఈ సవరణ వల్ల లీటరు పాల ధర సుమారు 2.5 నుంచి 3.5 శాతం వరకు పెరిగింది. ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తున్న తరుణంలో నెయ్యి, వెన్న ధరలు పెరగడం వల్ల ప్రజలపై భారం పడే అవకాశం ఉంది.

ఈ సమయంలోనే గృహ అవసరాలకు, వంటకాల తయారీకి వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. కర్ణాటకకు చెందిన 'నందిని' బ్రాండ్, పాలు మరియు పెరుగు ధరలను పెంచిన వారం రోజులకే, వినియోగదారులపై మరో భారాన్ని మోపింది. రాష్ట్రవ్యాప్తంగా నెయ్యి, వెన్న, పనీర్ ధరలను కూడా పెంచింది. ముఖ్యంగా నందిని నెయ్యి ధర గణనీయంగా పెంచింది. గతంలో రూ. 715గా ఉన్న ఒక లీటర్ నెయ్యి ప్యాకెట్ ధర, ఇప్పుడు రూ. 850కి చేరింది. అలాగే ఒక కిలో పనీర్ ప్యాకెట్ ధర రూ. 408 నుండి రూ. 485కి పెంచింది. 500 గ్రాముల ఉప్పు లేని వెన్న ధర రూ. 285 నుంచి రూ. 390కి పెరిగింది.
బెంగళూరు మిల్క్ యూనియన్ ప్రకటించిన ఈ కొత్త ధరలు నవంబర్ 4 నుండి అమల్లోకి వచ్చాయి. నందిని ఇప్పటికే లీటర్ పాలపై రూ.8 పెంచింది. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+