లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఐపీవోకు ముందు కీలక నిర్ణయం! ఎల్ఐసీ ఐపీవోకు అడుగులు వేగంగా పడుతున్నాయి. త్వరలో సెబికి డ్రాఫ్ట్ పంపించనుంది ప్రభుత్వం. ఇలాంటి సమయంలో కార్పోరేట్ గవర్నెన్స్ నిబంధనలను చేరుకోవడంలో భాగంగా కొత్తగా ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లను ఎల్ఐసీ తన బోర్డులో నియమించుకుంది. గత నెలలో ఈ ప్రక్రియను పూర్తిచేసినట్లుగా తెలుస్తోంది. సెబికి డ్రాఫ్ట్ సమర్పించడానికి ముందు కార్పోరేట్ గవర్నెన్స్ నిబంధనలు చేరుకోవడం ముఖ్యం. అందుకే ఈ నియామకాలను చేపట్టింది.
మాజీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ అంజులీ చిబ్ దుగ్గల్, సెబి మాజీ సభ్యులు జీ మహాలింగం, మాజీ ఎస్బీఐ లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ నుతియాల్ ఉన్నారని తెలుస్తోంది. వీరితో పాటు చార్టర్డ్ అకౌంటెంట్ ఎంప విజయ్ కుమార్, రాజ్ కమల్, వీఎస్ పార్థసారథిలను కూడా డైరెక్టర్లుగా నియమించింది ఎల్ఐసీ బోర్డు. కొత్తగా ఆరుగురు జత చేరడంతో మొత్తం 9 మంది డైరెక్టర్లు అయ్యారు. అన్ని ఖాళీలు పూర్తయ్యాయి.

ఈ వారంలో ఐపీవో కోసం సెబికి దరఖాస్తు చేయనున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే ఇదివరకే తెలిపారు. ఎల్ఐసీ వ్యాల్యూ రూ.5 లక్షల కోట్లుగా తేల్చారు. ఐపీవో తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను వెనక్కి నెడుతుందని అంచనా. ఎల్ఐసీ వాటాల విక్రయంలో పాలసీదారులకు పది శాతం కేటాయించనున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications