IPO: కొంప ముంచిన ఐపీవో.. నిండా మునిగిన ఇన్వెస్టర్లు.. 60 శాతం ఆవిరైన షేర్ ధర..
wealth destructor: ఇప్పటి వరకు పేలవమైన ఐపీవో షేర్ గా పేటీఎం గుర్తింపు పొందింది. ఎందుకంటే ఈ స్టాక్ లో పెట్టుబడులు పెట్టిన చాలా మంది సంపద ఎండలో పెట్టిన ఐస్ ముక్కలాగా వేగంగా కరిగిపోయింది. అయితే ఇదే క్రమంలో మరో ఐపీవో స్టాక్ 12 నెలల కాలంలో ఇన్వెస్టర్లను పేదవారుగా మార్చేసింది. దీంతో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన చాలా మంది ఇన్వెస్టర్లు ఆందోళనలో ఉన్నారు.

అప్పుడు అలా ఇప్పుడు ఇలా..
మార్కెట్లోకి ఐపీవోగా వచ్చిన AGS ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ప్రస్తుతం ఒక వెల్త్ డిస్ట్రక్టర్స్ జాబితాలో చేరింది. అవును ఈ ఐపీవో కొందరు ఇన్వెస్టర్లకు మాత్రం భారీ లాభాలను అందించినప్పటికీ ప్రస్తుతం షేర్ ధర 60 శాతం వరకు ఆవిరి కావటంతో మరికొందరు తీవ్రంగా నష్టపోయారు. 2022లో తొలిగా మార్కెట్లోకి వచ్చిన ఏజీఎస్ ఐపీవో తన నష్టాలతో ఇన్వెస్టర్లను పేదలుగా మార్చింది.

పడిపోయిన షేర్ ధర..
జనవరిలో ఈక్విటీ మార్కెట్లోకి కంపెనీ షేర్ రూ.175 ఇష్యూ ధరతో లిస్టయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈరోజు దాని షేర్ విలువ రూ.70.80కి దిగజారింది. ఓమ్ని-ఛానల్ పేమెంట్ సొల్యూషన్ కంపెనీ ఐపీవో రూ.680 కోట్లును ఐపీవో ద్వారా ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. స్టాక్ ఆల్ టైం హై ధర రూ.181.85 వద్ద నమోదు కాగా ఆ తర్వాత వచ్చిన అమ్మకాల ఒత్తిడితో స్టాక్ కోలుకోలేక దిగజారుతూ వచ్చింది. ప్రస్తుతం షేర్ ధర దాని ఆల్ టైం హై కంటే దాదాపు 60.95% దిగువన ట్రేడ్ కావటం ఇన్వెస్టర్లలో గందరగోళానికి కారణమైంది. అసలు ఈ షేర్లను హోల్డ్ చేయాలా లేక విక్రయించాలా అనే ఆలోచనలో వారు ఉన్నారు.

కంపెనీ వ్యాపారం..
AGS ట్రాన్సాక్ట్ టెక్ అనేది బ్యాంకులు, కార్పొరేట్‌లకు డిజిటల్ అండ్ నగదు ఆధారిత పరిష్కారాలను అందించే భారతదేశంలో అగ్రిగేటర్ ఓమ్ని-ఛానల్ చెల్లింపు సేవలను అందిస్తున్న సంస్థ. ఇది ATM, క్యాష్ రీసైక్లర్ మెషిన్(CRM) అవుట్‌సోర్సింగ్, నగదు నిర్వహణ, లావాదేవీల ప్రాసెసింగ్ సేవలు, మొబైల్ వాలెట్ల వంటి సేవలను అందిస్తోంది.


Click it and Unblock the Notifications