Dividend: రెండవ త్రైమాసికం ముగియటంతో అనేక కంపెనీలు వరుసగా తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేయటంతో పాటు.. ఇన్వెస్టర్లకు డివిడెండ్, బోనస్ షేర్లను అందిస్తున్నాయి. తాజాగా అగ్రోకెమికల్ స్టాక్ అయిన బహుళజాతి సంస్థ, బేయర్ కూడా తన ఇన్వెస్టర్లకు మంచి బహుమతిని ప్రకటించింది.

కంపెనీ ప్రకటన..
దేశంలో పంట రక్షణలో బేయర్ అగ్రోకెమకల్స్ పరిశ్రమలో అగ్రగామిగా ఉంది. పంట సంరక్షణ, విత్తనాలు, పర్యావరణ శాస్త్రాల్లో కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. తాజాగా ఫలితాలు విడుదల చేసిన కంపెనీ ఒక్కో షేరుకు రూ.100 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించిన కంపెనీ బోర్డు డైరెక్టర్లు నవంబర్ 09న డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయించినట్లు సెబీకి తెలిపింది. దీనికి ఈనెల 19ని రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. షేర్‌హోల్డర్‌లకు డిసెంబర్ 08న డివిడెండ్ బదిలీ చేయబడుతుందని కంపెనీ తెలిపింది.

షేరు ధర వివరాలు..
ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 21,344.80 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.162.6 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ లాభం రూ.154.1 కోట్లుగా ఉంది. ఈ కాలంలో లాభాల్లో 5.51 శాతం వృద్ధి నమోదైంది. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో బేయర్ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.4,735 వద్ద ట్రేడ్ అవుతోంది. షేర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.5,667.75 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.4,218.05గా ఉంది

కంపెనీ వ్యాపారం..
ఆవాలు, మినుము, పత్తి, జొన్న విత్తనాలతో కూడిన విత్తనాల పంపిణీ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరం క్యూ3లో విక్రయించినట్లు ప్రకటించింది. 1953లో స్థాపించబడిన కంపెనీ అనేక సబ్సిడరీ కంపెనీలకు కలిగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 150 ఏళ్ల ప్రస్థానం కలిగి ఉన్న కంపెనీలో 125 సంవత్సరాలకు పైగా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. దేశంలో కంపెనీ మెుత్తం 13,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అలాగే ఆరు తయారీ యూనిట్లతో పాటు 3 రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కేంద్రాలను కలిగి ఉంది. దేశంలో ఫార్మసుటికల్స్ విభాగాన్ని Bayer Zydus పేరుతో నిర్వహిస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications