Multibagger Stock: మార్కెట్లు కుదుటపడిన తర్వాత చాలా మిడ్ క్యాప్ కంపెనీలు తమ ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చాయి. ఈ క్రమంలోనే ఓ కంపెనీ తన ఇన్వెస్టర్లను ఏకంగా కోటీశ్వరులుగా మార్చేసింది. లక్ష కోట్లుగా మారిన ప్రయాణం ఎలా జరగింది..? అసలు ఈ మల్టీబ్యాగర్ ఏ రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తుందో ఇప్పుడు చూద్దాం.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ప్యాకింగ్ రంగంలోని మిడ్‌క్యాప్ కంపెనీ AGI గ్రీన్‌ప్యాక్ షేర్ గురించే. ఈ స్టాక్ రెండు దశాబ్దాల కాలంలో ఇన్వెస్టర్లను ఏకంగా కోటీశ్వరులుగా మార్చేసింది. ఈ క్రమంలో 16,000 శాతానికి పైగా రాబడిని అందించింది. దీర్ఘకాలంలో పెట్టుబడులను కొనసాగించిన పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ సూపర్ రిటర్న్స్ అందించింది.

కంపెనీ వ్యాపారం..
ఈ కంపెనీ ఉత్పత్తులను ప్యాక్ చేసేందుకు వినియోగించే మెటీరియల్స్ సప్లై చేస్తుంటుంది. ముఖ్యంగా బాటిల్స్ ప్యాకింగ్ కోసం అనేక కస్టమర్లను కలిగిన ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.2.13 వేల కోట్లుగా ఉంది. కంపెనీ కస్టమర్లలో ఎక్కువ శాతం మద్యం కంపెనీలు ఉన్నాయి. 2002లో మార్కెట్లో లిస్ట్ అయిన ఈ స్టాక్ మంచి పనితీరుతో మల్టీబ్యాగర్‌గా అవతరించింది. ఈ కంపెనీ 1960లో స్థాపించబడింది.

లక్ష పెట్టుబడికి కోట్లు..
అక్టోబర్ 20న ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్ల ధర రూ.324.50గా ఉంది. 20 ఏళ్ల క్రితం ట్రేడింగ్ ప్రారంభమైన సమయంలో షేర్ ధర రూ.2.02గా ఉంది. అప్పట్లో ఎవరైనా ఇన్వెస్టర్ ఈ కంపెనీలో రూ.లక్ష పెట్టుబడి పెట్టి దీర్ఘకాలం పాటు ఇప్పటికీ కొనసాగించి ఉండే దాని విలువ రూ.1.60 కోట్లకు చేరుకుంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.407.70 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.178.25గా ఉంది.

2022లో రిటర్న్స్ ఇలా..
స్వల్పకాలంలోనూ కంపెనీ షేర్లు మంచి లాభాలనే అందించాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు షేర్ దాదాపు 49 శాతం పెరిగింది. ఏడాది కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే షేర్ విలువ 44 శాతం ఎగబాకింది. ఐదేళ్ల పనితీరును గమనిస్తే.. 192 శాతం రాబడిని అందించింది. ఈ సమయంలో షేరు ధర రూ.113 నుంచి రూ.330.50కి చేరుకుంది.


Click it and Unblock the Notifications