Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు.. కారణం ఇదే..!
భారీగా పెరిగిన బంగారం ధరలు గత నెల రోజులు తగ్గింపు బాట పట్టాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరగడం, అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే దేశీయంగా బంగారానికి డిమాండ్ ఉందని పేర్కొంటున్నారు. ఇక ఇన్న రోజులు భారీగా బంగారం కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు దాన్ని అమ్మడం వల్ల కూడా పసిడి ధరలు తగ్గుదలకు కారణంగా అంచనా వేస్తున్నారు.
గత సంవత్సరం కాలంగా చైనాతో పాటు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అంతే కాదు అక్కడి పెట్టుబడిదారులు, ప్రజలు కూడా భారీగా పసిడిని కొనుగోలు చేశారు. దీంతో బంగారానికి డిమాండ్ ఏర్పడి ధరలు భారీగా పెరిగాయి. అయితే చైనా ప్రభుత్వం విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు విధించింది. దీంతో స్థానిక పెట్టుబడిదారులు పెట్టుబడి కోసం తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నారు. దీంతో కూడా బంగారం ధరలు తగ్గుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది. అటు అమెరికాలో కూడా ఈ ప్రభావం ఉంది.

దీంతో అక్కడ ఆర్థిక వృద్ధి మందగించింది. ద్రవ్యోల్బణం కూడా పెరుగుతోంది. దీంతో సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. యూఎస్ లో మధ్యంతర ఎన్నికల ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ ఫెడ్ వడ్డీ రేట్లను మార్చలేదు. అయితే వచ్చే సమావేశాల్లో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. హార్మూజ్ జలసంధి వద్ద ముడి చమురు రవాణా ఇబ్బందిగా మారింది. ఇరాన్, హౌతీలు చమురు నౌకలు టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. ఫలితంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 117 డాలర్లకు పైగా చేరింది.
ముడి చమురు ధరల ప్రభావం ఇండియాపై కూడా పడే అవకాశం త్వరలోనే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. అక్టోబర్ లో రిజర్వ్ బ్యాంక్ ఇండియా రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఇది బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పడిపోతున్నాయి. బంగారం ధరలు స్వల్ప కాలంలో తగ్గినప్పటికీ భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications