Mahindra Company: ఇటీవలి కాలంలో పన్ను జీఎస్టీ, పన్నులకు సంబంధించి అనేక సంస్థలకు నోటీసులు పంపబడుతున్నాయి. గతవారం ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్టార్టప్ జొమాటో సైతం ఇలాంటి నోటీసులను అందుకున్న సంగతి తెలిసిందే.
మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ దాని ద్విచక్ర వాహన వ్యాపారానికి సంబంధించి GST పాలనకు ముందు అందుబాటులో ఉన్న ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ క్రెడిట్‌ను తప్పుగా ఫార్వార్డ్ చేయటంపై పెనాల్టీ విధించింది. ఈ వ్యవహారంలో జీఎస్టీ అధికారుల నుంచి రూ.56 లక్షలకు పైగా జరిమానా విధించబడినట్లు కంపెనీ వెల్లడించింది.

మహీంద్రా టూ-వీలర్స్ లిమిటెడ్ ద్విచక్ర వాహన వ్యాపారానికి సంబంధించి అహ్మదాబాద్ సౌత్ బ్లాక్-4లోని CGST, సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయం అసిస్టెంట్ కమిషనర్ నుంచి కంపెనీకి సమాచారం అందిందని M&M స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. కంపెనీకి రూ.56,04,246 జరిమానా విధిస్తూ ఆర్డర్ వచ్చింది. ఈ వ్యాపారం MTWL నుంచి వేరు చేసి M&Mలో విలీనం చేయబడింది. అసెస్‌మెంట్ ఆధారంగా అప్పీల్ దాఖలు చేయబడుతుందని, అప్పీలేట్ స్థాయిలో అనుకూలమైన ఫలితాన్ని ఆశిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. ఆర్థిక పరమైన ప్రభావాన్ని చూపుతుందని నమ్మడం లేదని కంపెనీ తెలిపింది.
గతవారం జీఎస్టీ అధికారుల నుంచి ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటోకు సైతం పన్నుకు సంబంధించిన నోటీసులు అందాయి. కంపెనీ రూ.402 కోట్లు చెల్లించాలంటూ డెలివరీ ఛార్జీలకు సంబంధించిన విషయంలో కంపెనీ నోటీసులు అందుకుంది. డెలివరీ భాగస్వాముల కోసం డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తారు కాబట్టి ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత లేదని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో దాఖలు చేసింది. షోకాజ్ నోటీసుకు తగిన సమాధానం చెబుతామని స్టాక్ ఎక్స్ఛేంజీకి ఇచ్చిన సమాచారంలో జొమాటో తెలిపింది.


Click it and Unblock the Notifications