Pharma Investments: ప్రపంచ ఫార్మా రంగంలో తెలంగాణ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతంగా ఫార్మా పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో ప్రఖ్యాత కంపెనీ భారీగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.

బయోఏషియాలో భాగంగా..
ప్రపంచంలోని ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ తన గ్లోబల్ డ్రగ్ డెవలప్‌మెంట్, ఐటి సామర్థ్యాలను విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కంపెనీ రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. బయోఏషియా 2023లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సమిత్ హిరావత్‌తో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
కొత్తగా ఉపాధి కల్పన..
కంపెనీ పెట్టుబడుల నిర్ణయం కారణంగా రానున్న కాలంలో 1,500 మంది ఉపాధి అవకాశాలు పొందుతారని తెలుస్తోంది. BMS పెట్టుబడులను ప్రకటించటంపై మంత్రి కేసీఆర్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఒకటైన BMS.. హైదరాబాద్ మహానగరాన్ని ఎంచుకోవటం గర్వించదగ్గ విషయంగా తాను గట్టిగా నమ్ముతున్నానని కేటీఆర్ తెలిపావెల్స్పన్ పెట్టుబడులు..
వెల్స్పన్ గ్రూప్ తెలంగాణలో రూ.3,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. టెక్స్‌టైల్ పార్కు ప్రారంభోత్సవంతో వెల్‌స్పన్ గ్రూప్ ప్రకటనను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో వెల్‌స్పన్ గ్రూప్ అత్యాధునిక టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు వెచ్చించిన రూ.2,000 కోట్లకు ఈ పెట్టుబడి అదనంగా ఉంది. చందనవెల్లిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, ఆ ప్రాంతంలో నెలకొల్పిన పరిశ్రమల్లో యువత, మహిళలకు ఉపాధి కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులను మంత్రి ఆదేశించారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications