Tur Dal: ప్రస్తుతం భారతీయ వంటగదుల్లో ధరల యుద్ధం కొనసాగుతోంది. నూనె తర్వాత బియ్యం, చికెన్, గుడ్లు, కూరగాయలు, దినుసులు దాడి చేయగా.. ప్రస్తుతం కందిపప్పు రేట్లు షాకిస్తున్నాయి.
దేశంలో పెరుగుతున్న కందిపప్పు ధరలు వినియోగదారులపై ప్రభావం చూపటం ప్రారంభించింది. ధరల భారంతో అనేక మంది తమ వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో 27 శాతం కుటుంబాలు పప్పు వినియోగాన్ని తగ్గించినట్లు వెల్లడించాయి. ఇదే సమయంలో 5 శాతం మంది వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు. మరో 8 శాతం మంది తక్కువ ధర కలిగిన బ్రాండ్లు లేదా అన్‌బ్రాండెడ్ ఉత్పత్తులకు మారినట్లు తేలింది.

దేశవ్యాప్తంగా 320 జిల్లాల్లో 14,000 మందికి పైగా వినియోగదారుల నుంచి సేకరించిన సర్వే వివరాలు ప్రజాభిప్రాయాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఇదే సమయంలో 57 శాతం మంది మాత్రం తమ వినియోగాన్ని తగ్గించలేదని వెల్లడించారు. గడచిన పదేళ్ల కాలంలో మనదేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి 18.3 మిలియన్ టన్నుల నుంచి 27.5 మిలియన్ టన్నులకు పెరిగింది. గత రెండు నెలలుగా ధరలు పెరుగుతున్న తరుణంలో.. ప్రస్తుతం దేశంలో కందిపప్పు ధర సగటున రూ.165 నుంచి రూ.190 మధ్యలో కొనసాగుతోంది.
కందిపప్పు ధరలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్రప్రభుత్వాలు స్థానికంగా ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని.. స్టాక్ పరిమితుల రూల్స్ అతిక్రమించి నిల్వ చేసే వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ క్రమంలో స్టాక్ హోల్డింగ్ సంస్థల దగ్గర ఉన్న స్టాక్‌ను పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రకటించింది.
నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద కందిపప్పు, మినపప్పు నిల్వలపై పరిమితులను విధించింది. ఇవి ఉత్తర్వులు 2023 అక్టోబర్ 31 వరకు అమలులో ఉంటాయి. అలాగే రిటైల్ మార్కెట్లలో సరఫరాను పెంచేందుకు తమ వద్ద ఉన్న బఫర్ స్టాక్ నుంచి కందిపప్పును మిల్లర్లకు ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న పప్పులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేంతవరకు రిలీఫ్ కోసం తమ వద్ద ఉన్న నిల్వలను వినియోగించనుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications