IPO News: నిండా ముంచిన ఐపీవో.. లిస్టింగ్ తర్వాత ఎగబడి అమ్ముతున్న ఇన్వెస్టర్స్, బెట్ వేశారా..?
SPP Polymer IPO: 90 శాతానికి పైగా భారతీయ స్టాక్ మార్కెట్లలోకి వస్తున్న ఐపీవోలు లాభాలను అందించటం గడచిన 2 ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఫ్లాట్ లిస్టింగ్ నమోదు చేస్తూ ఇన్వెస్టర్లను తొలిరోజే నిరాశకు గురిచేస్తున్నాయి. ఈ కోవకు చెందిన కంపెనీ ఒకటి నేడు మార్కెట్లలోకి అరంగేట్రం చేయటంతో బెట్టింగ్ వేశిన పెట్టుబడిదారులు షాక్ అవుతున్నారు.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ఎస్‌పీపీ పాలిమర్ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో నేడు ఫ్లాట్ లిస్టింగ్ చూశాయి. వాస్తవానికి కంపెనీ ఐపీవో ఇష్యూ సమయంలో ఒక్కో షేరును రూ.59 రేటుకు విక్రయించగా నేడు కంపెనీ షేర్లు కేవలం 6.7 శాతం పెరుగుదలతో రూ.63 వద్ద మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అయితే లిస్టింగ్ తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను అమ్మకానికి దిగటంతో స్టాక్ లోయర్ సర్క్యూట్ తాకింది. దీంతో స్టాక్ ధర రూ.59.85కి పడిపోయింది. మార్కెట్లో 10,32,000 షేర్లను అమ్మకానికి పెట్టుబడిదారులు ఉంచగా కొనుగోలు చేసేవారి సంఖ్య సున్నాగా ఉండటం గమనార్హం.

వాస్తవానికి కంపెనీ షేర్లు గ్రేమార్కెట్లో ఇష్యూ ధర కంటే 25 శాతం ప్రీమియం పెరిగిన సంగతి తెలిసిందే. అయితే లిస్టింగ్ తర్వాత షేర్లు పొందిన ఇన్వెస్టర్లు పూర్తిగా నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఇష్యూను సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 12 వరకు అందుబాటులో ఉంచింది. అలాగే ప్రైస్ బ్యాండ్ గరిష్ఠ ధరను రూ.59గా ఉంచింది. ఈ క్రమంలో మార్కెట్ల నుంచి రూ.24.49 కోట్లను ఎస్ఎమ్ఈ ఐపీవో విజయవంతంగా సమీకరించింది. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా కంపెనీ ఉంచింది. ఇందుకోసం 41.5 లక్షల తాజా షేర్లను విక్రయించింది. రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 60 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 22 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. QIBలు ఐపీవో కొనుగోలులో పార్టిసిపేట్ చేయలేదు.
కంపెనీ ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ నగరంలో 2004లో స్థాపించబడింది. కంపెనీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో HDPE/PP నేసిన బట్టలు, HDPE/PP నేసిన బ్యాగ్‌లు, నాన్-నేసిన బట్టలు ఉన్నాయి. కంపెనీ ఐపీవో నుంచి సేకరించిన నిధులను రుణ చెల్లింపులకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలను తీర్చడానికి ఉపయోగించనుంది. అయితే నేడు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో మార్కెట్లోకి అడుగుపెట్టిన కంపెనీ షేర్లు మెుత్తానికి ఇన్వెస్టర్లను మార్కెట్లోకి అడుగుపెట్టిన తొలిరోజే పూర్తిగా నిరాశకు గురిచేసింది. చాలాకాలం తర్వాత మార్కెట్లో ఐపీవో క్రేజ్ ఉదృతంగా కొనసాగుతున్న వేళ బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications