రిటైర్మెంట్ ప్లాన్ ప్రతి ఒక్కరి జీవితంలోనూ కీలకమైన అంశం. పదవీ విరమణ తర్వాత కూడా ప్రతినెల ఖర్చులను సులభంగా తీర్చుకోవడానికి సరైన పెట్టుబడి స్కిం సలెక్ట్ చేసుకోవడం ముఖ్యం. మీ వృద్ధాప్యాన్ని ఆర్థికంగా సురక్షితం చేసే ఇలాంటి ఒక పథకం LIC సరళ్ పెన్షన్ యోజన. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు ఏంటో తెలుసా...

1. 40 నుండి 80 సంవత్సరాల మధ్య పెట్టుబడి : LIC సరళ్ పెన్షన్ యోజన అనేది సింగిల్ ప్రీమియం, నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ అండ్ ఇన్స్టంట్ యాన్యుటీ ప్లాన్. ఈ పాలసీలో మీరు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత మీకు పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది. ఈ పథకం గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, మీరు 40 సంవత్సరాల వయస్సు నుండే పెన్షన్ పొందడం ప్రారంభించవచ్చు. 40 నుండి 80 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ పథకంలో పెట్టుబడిపై పెన్షన్ పొందవచ్చు.
2. ఈ ప్లాన్‌లో రెండు ఆప్షన్లు ఉంటాయి:
*సింగిల్ లైఫ్ (Single Life): ఈ ఆప్షన్‌లో పాలసీదారుడు బతికి ఉన్నంత కాలం పెన్షన్ పొందుతారు. పాలసీదారుడి మరణం తర్వాత డిపాజిట్ చేసిన మొత్తం నామినీకి ఇవ్వబడుతుంది.
*జాయింట్ లైఫ్ (Joint Life): ఈ ఆప్షన్ భార్యాభర్తలిద్దరికి కవర్ చేస్తుంది. ఇందులో ప్రాథమిక పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ పొందుతారు. ప్రాథమిక పాలసీదారుడి మరణం తరువాత అతని/ఆమె జీవిత భాగస్వామి పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతూనే ఉంటారు. ఇద్దరూ మరణిస్తే, డిపాజిట్ చేసిన మొత్తాన్ని నామినీకి అందజేస్తారు.
3. పెన్షన్ మీ పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది: LIC సరళ్ పెన్షన్ ప్లాన్‌లో మీకు లభించే పెన్షన్ నేరుగా మీ పెట్టుబడి మొత్తంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే, మీకు అంత ఎక్కువ పెన్షన్ లభిస్తుంది. ఉదాహరణకు, మీరు 60 సంవత్సరాల వయస్సులో ఈ ప్లాన్‌లో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే మీకు సంవత్సరానికి రూ.64,350 పెన్షన్ లభిస్తుంది.
మీరు ఈ పెన్షన్‌ను మీ సౌలభ్యం ప్రకారం ప్రతినెల, త్రైమాసిక, 6 నెలలు లేదా ఏడాది ప్రాతిపదికన తీసుకోవచ్చు.
4. జాయింట్ లైఫ్‌లో పెన్షన్ ప్రయోజనాలు: జాయింట్ లైఫ్ ఆప్షన్‌లో మీ వయస్సు 60 సంవత్సరాలు ఇంకా మీ భార్య వయస్సు 55 సంవత్సరాలు అయితే మీకు సంవత్సరానికి రూ.61,600 లభిస్తుంది. మీరు మరణిస్తే పెట్టుబడి పెట్టిన మొత్తం మీ నామినీకి ఇవ్వబడుతుంది.
5. లోన్ సౌకర్యం కూడా: ఈ ప్లాన్ మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే మీరు దీని నుండి లోన్(Loan) కూడా తీసుకోవచ్చు. పథకంలో పెట్టుబడి పెట్టిన 6 నెలల తర్వాత మీరు లోన్ తీసుకోవడానికి అర్హులు అవుతారు. దీని వల్ల మీకు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. పదవీ విరమణ ప్లాన్ అనేది దీర్ఘకాలిక ఆలోచన. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు ఇంకా అవసరాలకు అనుగుణంగా సరిపోతుందో లేదో విశ్లేషించుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications