బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్ల కొత.. సీనియర్ సిటిజన్స్ మీకూడా..
ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ డిసిబి (DCB) బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేట్లను తగ్గించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం FD వడ్డీ రేట్లను 65 బేసిస్ పాయింట్లు (bps) వరకు కోత విధించింది. సవరించిన రేట్లు నేడు అంటే 14 ఫిబ్రవరి 2025 నుండి అమల్లోకి వస్తాయని తెలిపింది. గత వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 6.50% నుండి 6.25%కి తగ్గించిన తర్వాత ఈ సవరణ జరిగింది. అయితే 2020 తర్వాత ఇదే మొదటిసారి రెపో రేటు తగ్గింపు. రెపో రేటు తగ్గింపు బ్యాంకుల నిధుల ఖర్చును తగ్గిస్తుంది కాబట్టి రుణాలు ఇంకా డిపాజిట్ రేట్లపై ప్రభావం చూపుతుంది. తగ్గిన రెపో రేటు ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లకు కోతకు దారితీస్తుంది.
ఈ సవరణ తర్వాత, DCB బ్యాంక్ ఇప్పుడు సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు కాలపరిమితి గల రూ. 3 కోట్ల కంటే తక్కువ FD మొత్తాలపై 3.75% నుండి 8.05% మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. 19 నెలల నుండి 20 నెలల కాలపరిమితి గల FDలపై అత్యధిక వడ్డీ రేటు 8.05% ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు, రూ. 3 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు బ్యాంక్ 4.25% నుండి 8.55% మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇంకా వీరికి 19 నెలల నుండి 20 నెలల కాలపరిమితి గల FD మొత్తాలపై 8.55% అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది.

ఏ FD వడ్డీ రేటు తగ్గింది
సాధారణ పౌరులకు 26 నెలల నుండి 37 నెలల కంటే తక్కువ కాలపరిమితి FD వడ్డీ రేటును 55 బేసిస్ పాయింట్లు అంటే 8.05% నుండి 7.50%కి తగ్గించారు. 37 నుండి 38 నెలల వరకు ఉన్న కాలపరిమితి ఉన్న FD వడ్డీ రేటును బ్యాంక్ 20 బేసిస్ పాయింట్లు 8.05% నుండి 7.85%కి తగ్గించింది. DCB బ్యాంక్ కూడా 38 నెలల నుండి 61 నెలల కంటే తక్కువ కాలపరిమితి FD వడ్డీ రేటును 8.05% నుండి 7.40%కి అంటే 65 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు తగ్గింపులు
సీనియర్ సిటిజన్లకు 26 నెలల నుండి 37 నెలల కంటే తక్కువ కాలపరిమితి FD వడ్డీ రేటును 8.55% నుండి 8%కి అంటే 55 బేసిస్ పాయింట్లు తగ్గించారు. 37 నుండి 38 నెలల వరకు కాలపరిమితి ఉన్న FD వడ్డీ రేటును బ్యాంక్ 20 బేసిస్ పాయింట్లు 8.55% నుండి 8.35%కి తగ్గించింది. 38 నెలల నుండి 61 నెలల కంటే తక్కువ కాలపరిమితి FD వడ్డీ రేటును 8.55% నుండి 7.90%కి అంటే 65 బేసిస్ పాయింట్లు తగ్గించింది.


Click it and Unblock the Notifications